పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. కట్టిన పూవన్నెపుట్టంబు కెంజాయ
కమనీయసాంధ్యరాగంబుఁ గాఁగ
ముడివీడి వ్రేలు క్రొమ్ముడి సోగవెండ్రుకల్
కడలొత్తు చిమ్మఁజీకటులు గాఁగ
నురవడి నూఁగుచో నుప్పరం బెగయు ము
క్తాహారములు తారకములు గాఁగ
నిగుడుకాంతులతోడ నెమ్మోము నెత్తమ్మి
పరిపూర్ణచంద్రబింబంబు గాఁగ
గీ. వికచలోచనరుచులు చంద్రికలుఁ గాఁగ
యామవతియను విచికిత్స నావహింప
నతివ యొక్కర్తు తీఁగయుయ్యాల నూఁగె[1]
నింపు లిగురొత్త నొకపొదరింటిలోన. 46
 
ఉ. అందపుఱెప్పలం జెమట నంటిన పుప్పొడియున్ మొగంబునం
జిందిన పూవుఁదేనియల చిత్తడియున్ వెడజాఱు వేనలిం
జెందిన పుష్పకేసరవిశేషములున్ సిరిఁ జేయఁ గోసె రా
కేందునిభాస్య యోర్తు పొదరిండులు సొచ్చి ప్రసూనగుచ్ఛముల్. 47

చ. బలువిడి పయ్యెదం దొడిసిపట్టుచు నేర్పునఁ బాయఁద్రోయ వే
నలిఁ గబళించుచున్ మెలపునం గడకొత్తినఁ గొంగువట్టుచుం
జలమునఁ గంటకంబు దిగుచందమునం దను నాఁగఁగా లతా
నిలయము సొచ్చి కొసె నొకనీరజలోచన కమ్మక్రొవ్విరుల్. 48

సీ. పదపాణితలముల పగదలంచియుఁ బోలెఁ
దలిరుటాకుల బాదుఁ దలలువట్టి[2]
మేనిమార్దవముల మెఱపు తప్పును బోలె
విరు లూఁచముట్టుగా వెదకి త్రుంచి



  1. తీగయుయ్యల నూగె; తీఁగె యుయ్యలల నూఁగె
  2. పదపాణి తలములు పగ దలంచియుఁ బోలె తలిరుటాకులఁ బాడుఁ దలలువట్టి