పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కెమ్మోవి కెన యను కినుకఁజేసియుఁ బోలెఁ
దనిగమ్మఁబండులు దరిచివైచి
పలుకుసారస్యంబు పచరించు నని పోలెఁ
బూవుఁదేనియ మూరిఁబోవ విడిచి
ఆ. యొప్పు మేనుఁదీఁగె కుపమాన మని పోలె[1]
వఱలు లతల యార్జవంబుఁ జెఱచి
వనముఁగలయ నన్నివంకలఁ దానయై
కేళి సలిపె నొక్క కిసలయోష్ఠి.
 
సీ. చెలులఁ గేలికిఁ జేరఁ జీరుచోఁ బలుకాంతి
భ్రమరసంచారవిభ్రమముఁ జేయ
నలఁతమై యూర్చుచో నడరునిట్టూర్పుల
తావి తావికి వింతతనముఁ జేయ
...................................
..........................
.................................
........................[2]
ఆ. కోయఁబూని నట్టి కుసుమంబుఁ గోయక
మగుడఁ దిగుచు నెగుచు[3] మాటిమాటి
కించుకైన నాత్మ నిదియను నిశ్చయం
బూననేర కొక్కయుత్పలాక్షి. 50
 
వ. మఱియుం బెక్కువిధంబుల నవ్విలాసిను లివ్విధంబున విలాసంబులు నెఱపుచుఁ గుసుమంబులు గోసి యంతఁ గేళి చాలించి వచ్చి కమలకల్హారకుముదకవలయామోదమేదురదశదిశాభాగంబును నిష్యందమరందధారాబిందుతుందిలమదవదిందిందరసందోహక్రియాసంకులంబును దనువాతూలచాలనాచరితవీచీడోలాకేళీవినోద(వి)హా(రా)లోలమరాళ



  1. కవమాన మనివోలె
  2. ఈ రెండు చరణములు మూలమునందే వ్రాయఁబడలేదు.
  3. మగుడ డిగుచు నెగులు; మగుడి డిగుచు నెలుఁగు