పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. అని నిందించుచు నిందీవరాక్షు లందఱుం జేయునది లేక డెందంబులం గొందలించి బలు సందేహించుచున్న సమయంబున— 199

సహస్రానీకుని కడకు నారదుఁ డేతెంచుట


సీ. తెరువిచ్చి యంతంత దివి దేవసంఘంబు
మోడ్పుఁజేతులు ఫాలముల ఘటింపఁ
దనుపాండురప్రభాధాళధళ్యంబులు
పరిపూర్ణచంద్రఃప్రభలఁ జెనక
వీడి నల్గడఁ దూలియాడు[1] పాటలజటా
నటలు[2] నూతనవికాసంబు చేయ
వ్రేల నంటకమున్నఁ కేలఁ బట్టిన వీణె
హరినామకీర్తనం బాచరింప
తే. నఱుతఁ బునుకపేరులు[3] భుజంగాధిరాజ
హారములు దాల్చు శివునిపెం పలవరింప
వేడ్క నేతెంచె నాకాశవీథి డస్సి
నారదుఁడు తత్త్వవిద్యావిశారదుండు. 200
 
శా. గోకర్ణాంక దయాపయోనిధి[4] మరుద్గోకర్ణధారాపురీ
గోకర్ణాభరణాప్త వారరథికా[5] (?) గోభూజ విశ్రాణమా
లోకామాత్యకుమారశేఖల కృపాలోకావలోకాంచలా
లోకాలోకపరీత విశ్వవసుధాలోకావలోకాననా[6]. 201
 
క. భాసు రకీర్తినటీ హ
ల్లీసక భవనాయమాన లేఖాహి నరా
వాస విలాసమనోభవ
వాసవసమభోగ భోగివచనాభోగా[7]. 202



  1. వీజనలడఁ దూలియాడు
  2. తటలు
  3. యంతియు పడిశములు
  4. రియః పయోనిధి
  5. నారరధికా
  6. లోకాగ లోకావనా
  7. భోనితనుభోగా; భోగివచనసుభోగా