పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. అంతం గాంతాజనంబు భూకాంతుమేని కావంతయుం దెలివిగాన కంతరంగంబుల నెంతయు సంతాపం బగ్గలింపం దమసేయు శైత్యకృత్యంబు భసితంబునకు బ్రహితంబగు ఘృతంబునుం బోలె నిరర్థకంబై చనుటకుం గటకటపడి— 196

సీ. పరికింప నెల లాఱుఁ బాయని పలుగాకి[1]
క్రించుఁగోయిల కేల ప్రియముఁ జెప్ప
మంచిమాటలె కాని మరఁగ దెన్నటికైనఁ
గీరంబునకు నేల క్రిందవడఁగ
గతి దీలువడి యల్లఁగడలఁ బ్రవర్తించు[2]
నీ మరాళంబున కేల వెఱవ
మధుపాయి మెయి మలీమస మళిపోతంబు[3]
మేటీఁగ దీని[4] నేమిటికిఁ జూడఁ
ఆ. బోఁడి మెడలఁగాను బూతమై తిరుగు నీ
విషమశరుని నేల వేఁడికొనఁగఁ
బాదములను బడుట మీఁద మిక్కిలి గాక
యీవిహీనమతుల కేడ కరుణ. 197
 
చ. తను నవయంబు రా జనుచు దత్పరతం గొని యుంట[5] మౌళి మం
డనముగ నాచరించు హరు నాఁ డసమాయుధుతోడఁ గూడి నొం
చిన బలితంపు[6]దోసమునఁ జేసియు గాసిలు[7]చున్నవాఁడు నేఁ
డును గుముదాప్తుఁ డేటికిఁ గడుంగడు వేఁడఁగ నిద్దురాత్మునిన్. 198



  1. బయెని పలుగాకి
  2. యల్లఁ గదల ప్రివర్తించు
  3. మఱిమఱి మసమరిపోతంబు
  4. మోటీఁగటిని
  5. గొనితంట; గొనికంట
  6. వలితంపు
  7. నాసెలు