పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామసన్నిభుఁ డని రాయిళ్ళఁ బెట్టకుం
దలుక మావిచుని గోకిలములార
భువి వినిర్మలకీర్తిఁ[1] బోలు నిన్నని చంద్ర
విడువు మారాజుపై విరసబుద్ధి
ఆ. ధన్యులార మీకుఁ దప్పేమి సేసె మా
ధరణివిభుని నింత తవిలినొంప[2]
ననుచు చయము ప్పియము ననలారఁ గ్రొంబూవు[3]
టెత్తు రోలి[4] మీఁడులెత్తి మ్రొక్కి. 187
 
సీ. మొగమోడి నిలువుఁడీ మొగమెత్తఁ జేయక
కీరంబులార మ్రొక్కెదము మీకు
దయలాత్మఁ బెనుపులు దాంట్లు వేయక యెల
దేంటులార మీ కిదే జోహారు
వల్లదెల్లనక మన్నన సేయుఁడీ[5] మీకు
నంజలు లివె కలహంసలార
పక్షీకరింపుఁడీ పలుమాఱుఁ గూయక
ప్రియభాష లివె మీకుఁ బికములార
ఆ. అయ్యలార మీర లతనురాజ్యమునకు
వేడుగడయు లోక మెల్ల నెఱుఁగ
మీరు కలిమి గాదె మేనితోఁ బాసియు
శంబరాంతకుండు సబలుఁ డగుట. 188
 
వ. అని యనేకప్రకారంబులం బ్రియములు వలికి యనంతరంబ— 189



  1. భూవినిర్మలకీర్తి
  2. దనరిదొంప
  3. నసలార గ్రొత్తపూ
  4. లోరి
  5. నల్లదెల్ల తనుసన్నసేయుడి