పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. మంచునఁ జేరిచి[1] మలయజద్రవ మొక్క
తరళాక్షి మేన నంతట నలందెఁ
దోడ్తోనఁ బూఁదేనెఁ దోఁచి[2] యల్లనఁ ద్రిప్పె[3]
వెలఁది యొక్కతె వట్టివేళ్ళసురటి
వడిగొన్న పన్నీటఁ దడిపి పుప్పొడి మెత్తె
నడుగుఁదమ్ముల నొక్కయలరుఁబోఁడి
కరపుటంబులఁ బచ్చకర్పూరము నలంచి
కాంత యొక్కతె మస్తకమున నించెఁ
తే. బేరురంబున నొక చంద్రబింబవదన
కమలినీబిసకాండహారములు చేర్చెఁ
గలువక్రొవ్విరి[4]మొగ్గలకంకణంబు
బాల యొక్కతె దొడిగె భూపాలుకేల. 190
 
ఉ. భారపుఁబయ్యెదం జిగురుఁబయ్యెద మాటి మృణాలవల్లరీ
హారములం ఘటించి ధవళాయతలోచన యోర్తు రాజబృం
దారకభర్త పాదనలినంబున మెల్లనె యొత్తిపట్టె వి
స్ఫారనవప్రవాళములఁ బాణిపుటంబుల కెత్తు సేయుచున్. 191

చ. కువలయనేత్ర యోర్తు నృపకుంజరుముందట నిల్చి భస్త్రికా
వివరముఖంబునం దనదువ్రేలు గదల్చుచుఁ బట్టె[5] మోముపై
నవిహితలీల మంచు గురియం బృధులస్తని యోర్తు నూత్న ప
ల్లవముల నీజనంబు పటలబుగఁ గేలఁ దెమల్చి త్రిప్పఁగన్. 192
 
వ. మఱియును. 193



  1. జెరివిడి
  2. తోరోతనంబూఁదెనందొంచి
  3. త్రిప్పి
  4. కమల గ్రొల్పిరి
  5. బట్టి