పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుష్పసాయకరజఃపుంజంబుక్రియ మోము
దమ్మి నొప్పెడు వెల్లఁదనమువానిఁ
బూఁబోఁడిఁ నేకాగ్రబుద్ధి లో నీక్షించు
నోజ కన్నులు మూసియున్నవానిఁ
తే. దొడరి గుఱిసేసి మరుఁ డేయుతూపులకును
దప్పఁ గ్రుంకెడి విధమునఁ దాపవశతఁ
బూవుఁబాన్పున నిట్టట్టుఁ బొరలువి
జనవరాగ్రణిఁ గాంచి ససంభ్రమముగ. 183

వ. చేర నేతెంచి శుభలక్షణలక్షితుండగు విశ్వక్షమాధ్యక్ష తనుతాపలక్షణం బుపలక్షించి పక్ష్మలాక్షు లాక్షణంబ యక్కుమారోత్తముచిత్తము చిత్తజాశుగాయత్తం బగుట చిత్తంబుల నెఱింగి తత్తరంబునం దత్తనుతాపంబు మరలించుటకునై శిశిరోపచారంబులు సేయం దలంచి— 184

శిశిరోపచారములు


మ కచభారంబులఁ గ్రొత్తచెంగలువలం గైసేసి పూఁబయ్యెదల్
కుచకుంభంబులపై మృణాలలతలం గూడం బ్రతిష్ఠించి[1] లేఁ
తచిగు ళ్ళంతటఁ గావిపుట్టముల మీఁదం జేర్చి లీలావతీ
ప్రచయం బల్లన వచ్చి రాజసుమనోబాణానలం బార్పఁగన్. 185
 
వ. సమకట్టి. 186

సీ. మానితాకృతి యని మామహీపాలుపైఁ
గుచ్చితంబులు మాను కుసుమబాణ
భాషావిశేషాహిపతి యని నవమాన
మాను మారాజుపై మత్సరంబు



  1. బ్రతింపించి