పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెక్కపంబగు వెచ్చవేదనఁబాక్(బుఁ)[1]
బూనగ నోపమిఁ బోలెఁ మార్చు
మదినిండి తొలఁకు కోమలిమీఁది ప్రేమ న
ల్గుల కొర్తుగతిఁ జాదుకొనఁ జెమర్చు
తే. మనసు గుఱిసేసి మరుఁ డేయు మార్గణంబు
లచట వర్తించు సతిఁ దాఁకు ననెడు భీతి
మాటిమాటికి మాటిడుమాడ్కిఁ గేలు
డెందమునఁ జేర్చు నారాజనందనుండు. 180
 
మ. తను నిద్రాసుఖసక్తుగా నెఱిఁగినం దన్వంగి భూపాలనం
దన కోపాతిశయమ్మున న్నిజమనోధామంబులో నిల్ప కేఁ
గునొ యెందేనియు నన్నభీతిఁబలె గూర్కుం గంటికిం జేర నీ
క నృపాలుండు[2] చలించు నాత్మ సుమనఃకాండప్రకాండాహతిన్. 181
 
వ. ఇవ్విధంబున నుల్లంబున నతిశయిల్లు నాయల్లకాంబుధిం బడి తల్లడిల్లుచు భూవల్లభుం డుండె వంత నంతఃపురపరిచారికాజనంబు భూకాంతుం గేళి సౌధంబులోనం గానక యచ్చెరుపడి యచ్చేరువ విలాసవనంబులోనికి నొకరుండు[3] చనిన హలకలశకులిశాంకితంబులగు పదంబుల చొప్పు దప్పక వనంబుం గలయవెదకుచు వచ్చి మాకందతరుమధ్యంబునం బ్రకాశించు మాధవీలతామండపమున— 182
 
సీ. సంకల్పభవశాత[4]శరపాతహతిఁ బోలెఁ
దటతట నదరు[5] డెందమ్మువాని
శిత[6]మారమార్గణచ్యుతమకరందంబు
గతిఁ గ్రమ్ము ఘర్మోదకంబువానిఁ



  1. వెక్కసంబగు లేమచ్చశందనఁబాకం
  2. మేల్కని పాలుండు
  3. మాకెదుండు
  4. పాత
  5. నలరు
  6. సిత