పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. నిక్కము నిద్రవోయె నని నేఁ గనుమోడ్చినఁ జేరి మక్కువం
జెక్కిలి ముద్దువెట్టికొని చేడియ నాపులకించుచందమున్
గ్రక్కునఁ జూచి సిగ్గువడి కన్నుల ఱెప్పల వ్రేలవైవ నే
నక్కలి[1]నవ్వుతో సరసిజాననఁ గౌఁగిటఁ జేర్చు టెన్నఁడో. 177
 
మ. అని కోర్కుల్ బహురీతులన్ మనములో నంతంత కెక్కించుచున్
వనితారత్నము మ్రోల లీల మెఱయన్ వర్తించునట్లైనఁ బై
కొని పట్టం జని మిథ్యయైన వగలం గుందున్ భయం బందు న
జ్జననాథుం[2] డురియాడుడెందమున హృజ్జాతోదితోన్మాదుఁడై. 178
 
సీ. కనుమూసి కల నిశిఁ గనుగొన్నయట్లైనఁ
జేరి సంభాషింపఁ జిత్తగించు
మేల్కాంచి సతిమ్రోల మెలఁగినయట్లైనఁ
గడఁగి సారెకు బయల్ గౌఁగిలించుఁ
జెలువ మిన్నక దన్నుఁ జీరినయట్లైన
విను నప్రమత్తుఁడై వీను లొగ్గి
కొమ్మ కౌఁగిటఁ దన్ను గూర్చినయట్లైనఁ
బరవశంబున మ్రానుపడుచు నుండు
ఆ. లలన దన్నుఁ గేళి కెలయించినట్లైనఁ
జాల నెమ్మనమున సంతసించు
మనుజవల్లభుండు మగువపై వలనంత
నంతరంగతాప మగ్గలింప. 179

సీ. నెలఁత చిత్తంబులోనికిఁ జేరఁదిగువఁ[3] జే
తులు సాఁచినట్లు చింతలు నిగుడ్చు
వెడ నిందుముఖి ఱెప్పవిధము (మెచ్చుటఁ) బోలెఁ
బ్రమదబాష్పములు నేత్రముల నించు



  1. నక్కడి
  2. నీ జననాథుం
  3. చెరఁ విగుర