పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. వెనుకఁ బడియున్న[1] పరిచర
జనవర్గము కన్నుమొఱఁగి సదనారామం[2]
బున కేఁగి యచట నొక్కఁడు
మనసిజదోదూయమానమానసుఁ డగుచున్. 167
 
సీ. కోయిల లెలుఁగిచ్చు ప్రాయంపుటెలమావి
మోఁకలన్నను మోము ముడిచికొనుచుఁ
గొదమతేఁటుల గముల్ గూడి వినోదించు
పసిఁడి బొన్నన్నను[3] గసరికొనుచుఁ
దెంకిపట్లనకయ[4] తెమ్మెరల్ విహరించు
తీవెయిం డ్లనినను దిట్టుకొనుచు
లేచి కీరసమితి లీలఁ బ్రవర్తించు
ననఁటు లన్నను జాలఁ గినిసికొనచు[5]
ఆ. జాలిఁబొంది మిగుల దోలాయమానుఁడై
క్రమ్ముకొన్న విరహ ముమ్మలింప[6]
నున్నచోట నుండ నుల్లంబు గొలుపక
వచ్చి వచ్చి రాజవల్లభుండు. 168
 
మ. కలయం బూచిన మాధవీనవలతాగారంబులో నైందవో
పలలీలామణివేదికాంతరమునన్ భ్రామ్యన్మిళిందాంగనా
వలిగానంబున కోడుచుం బయి పయిన్[7] వర్తించు పూఁదేనె సో
నలకున్ లోఁగుచుఁ బవ్వడించె మదనోన్మాదంబు రెట్టింపఁగన్. 169



  1. వెనున్ బడియుచున్ నుంచు
  2. సరి నారామం
  3. పసిడిపొన్నెన్నను
  4. తెంకి పట్లకయ
  5. నిఱిన్ని కొనుచు
  6. ముమ్మరింప
  7. మనితులు లీననోడుచు పైపైయిన్