పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. తలపోఁతలకుం జొచ్చి తనమనంబున— 170

సీ. నెమ్మది నుండంగ నిర్జరాధిపుఁడు మా
తలిచేత న న్నేల పిలువఁ బంపెఁ
బంపి యేటికిఁ జెప్పె బలభేది నాతోడ
సాకేతపతిపుత్రి జననవృత్తిఁ
జెప్పిన నే నేల చెవియొగ్గి వింటి త
త్పరబుద్ధి[1] నాలతాతన్వివరిత[2]
విన్న నేమిటి కుండె విద్రుమాధరరూపు
నేల నాయాత్మ నిర్మించినట్ల[3]
ఆ. యదియ[4] సందుగాఁగ నసమాస్త్రుఁ డత్యుగ్ర
సాయకములపాలు సేయఁదొడఁగె
నేమి సేయువాఁడ నీ తనూతాపంబు
....మెట్లు మాన్పువాఁడ నొక్కొ. 171
 
సీ. ఆరాజముఖి ముఖాంభోరుహం బెన్నఁడు
కనుబండువుగఁ జూడఁ గలుగునొక్కొ
యాయింతి బిగిచన్నుదోయి కౌఁగిటికిని
గూర్ప నా కెన్నఁడు గూడునొక్కొ
యాలేమ నునుమోవియమృతంబు తనివార
గ్రోల నెన్నండు చేకూరునొక్కొ
యాకొమ్మ మధురోక్తు లాలించి యెన్నఁడు
వీనుల విన సంభవించునొక్కొ



  1. తత్సరఁబుట్ట
  2. జరియ
  3. విరించినట్ల
  4. అవియ