పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. చూచియుఁ జూడని[1]విధమున
నాచిగురుంబోఁడి మాటలాడింపక హృ
ద్గోచరమై తరి దీకొల్పెడు
రాచకుమారితఁ గనం బరాకునఁ[2] జనంగన్. 161
 
చ. ఒదవిన కోపమున్ నిలువ గోరని శాపము నిచ్చె నోరి నీ
హృదయములోన నున్నయది యెవ్వతె యచ్చిగురాకుఁబోఁడితో
బదియును నాలుగేండ్లు బెడఁబాయునుగా కని యామృగాక్షి హా
మది నభిరీమరామల కమాన్యత కోపము సేయకుండునే. 162

క. కోపంబున ని ట్లాసతి
శాపం బిచ్చుటయు నాత్మ సరకుగొనక సం
దీపితచింతావశుఁడై
భూపాలకసుతుఁడు వేగఁ బురవరమునకున్. 163

వ. వచ్చి త న్ననుపవచ్చిన మాతలి నుచితప్రకారంబున వీడ్కొలిపి యనంతరంబ యభ్యంతరంబునకుం జని యేకాంతం బిందుమణిసౌధం బెక్కి చింతాభరంబున— 164

ఉ. కోలుకొనంగలేనిధృతి గూరిన యుల్లము దల్లడింప నే
నేల విరాళిఁగొంటి విబుధేశ్వరు మాటలు నమ్మి యమ్మహీ
పాలతనూజ చేకుఱు నుపాయము నాకిది యెద్ది యొక్కొ యీ
జాలి యడంచి పుణ్యములజాడఁ జనంగ దయాళుఁ డెవ్వఁడో. 165

మ. అని చిత్తంబున నంతకంతకుఁ గడున్ హత్తించు చింతాభరం
బున మేనన్ విరహజ్వరానలశిఖల్ పుట్టింపఁ బూవింటిజో
దనుకంపాగుణశూన్యుఁడై తొడరి చేయం జాలకృత్యంబులన్
జననాథుం డడుగూది యొక్కెడ[3] నిజేచ్ఛన్ నిల్వరా కెంతయున్. 166



  1. చూచింజూడని
  2. కుమారితగనూ పరాకున
  3. జననాథుఁడు గూఁటి యెక్కడ; జననాథుండు కలంగి యొక్కడ