పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. పరిబింబితవప్రోపరి
పరికీలితవివిధరత్నపంక్తులు వెలయం
బరిఖకు సాక్షాద్రత్నా
కర మను నుత్ప్రేక్ష నిజముగా నొనరించున్. 103

సహస్రానీకవర్ణనము


క. ఈ కరణి నసమవైభవ
శ్రీకరమై యొప్పు నప్పురీతిలకంబును
లోకోత్తరుఁఢు సహస్రా
నీకుం డనుడుపతి యేలు నిత్యవిభూతిన్. 104

సీ. ఎవ్వాని పటుహేతి కెదిరి పాఱక
పోరురాజన్యులు బారిగొఱియ
లెవ్వాని భుజశక్తి కిభకిరిఫణితతుల్[1]
ప్రా పాసవడియున్న బంధువర్గ
మెవ్వాని దాతృతాహేవాకమున కింద్రు
పట్టణద్రుమములు బడిసివాటు[2]
లెవ్వాని సత్కీర్తి కీరేడుజగములు
కేళీనివాసనికేతనములు
తే. వాఁడు నుతిసేయఁదగు నిత్యవైభవుండు
చంద్రవంశాబ్ధిచంద్రుండు సవ్యసాచి
మనుమసంతాన మంగనాజనమనోహ
రాతిశయరూపవిభ్రమాయతనమూర్తి. 105
 
శా. నానానేకపగండమండలవతానస్యందిదానోదక
స్నానక్లిన్నసభాంగణస్థలుఁడు విశ్వక్షోణిదోర్విక్రమ
శ్రీనిష్ణాత నిరూఢిఁ గైకొని మహోత్సేకప్రపూర్తిన్ సహ
స్రానీకక్షితిపాలుఁ డేలె ననివర్యాఖర్వగర్వోన్నతిన్. 106



  1. కిభకిరినిదిదతుల్; కినకరనివహముల్
  2. రాటు