పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శా. ఏలెన్ సజ్జనసాధురక్షణకళాహేలన్[1] మహీమండలిం
బోలెం బూర్వనృపాలురన్ నృగు దిలీపున్[2] రాము నాభాగునిం
దోలెన్ వైరుల దిగ్వటంకములకనున్[3] దోర్విక్రమప్రౌఢిచే
నా లీలావిభవాతిలోకుఁడు సహస్రానీకుఁ డత్యున్నతిన్. 107
 
సీ. వలెనన్న యప్పుడ వర్షంబు హర్షంబు
గొనసాఁగ మేఘంబు గురియుచుండఁ
గాఁపుపాలిటి కామగవియై వసుంధర
దండిమై ముక్కారుఁ బండుచుండఁ
బాలువెన్నలకు వ్రేపల్లె[4]వాడలఁబోలె
నవటుగాఁ బసులు చన్నవిసి పిదుక
జనములు తనపేరు వినినయంతనె మోడ్పుఁ
జేతు లౌఁదలలకుఁ జేరఁదిగువఁ
తే. గాలగతు లనుమాట లోకంబువారు
వినియు నెఱుఁగకయుండ నజ్జనవిభుండు
మెఱసి భుజశక్తి వారిధుల్ మేరగాఁగ
ధాత్రిఁ బాలించె నేకాతపత్రముగను. 108
 
సీ. వెండియుఁ బైడియు వీడ్వడ[5] నిండ్లలో
నెమ్మది[6] నుండిరి నిఖిలజనులు
పుడమిమో పెడలించి భుజగాధినాథుండు
వేడ్కతో హాయిని విశ్రమించెఁ



  1. సాధుక్షణతకతిరిన్ చెలంన్
  2. నుగుటి విభున్
  3. తోలెన్ వ్రేఱురులటిన్ని టంకములకున్
  4. పాడియత్నదల రెపల్లె; బాఁడి యెల్లెడెల రేపల్లె
  5. విడాడ
  6. నెయిది; నెమ్మిమై