పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. కొసరు టెలుఁగులుగా[1] నిత్తు రెసక మెసఁగ[2]
విలుచుచోఁబూలఁ[3] దనియాడు విటజనాళి
కింపు సేఁతలఁ దనివి రెట్టింపుఁ జేయ[4]
విరులయంగళ్ళ పుష్ప[5]లావీజనములు. 98
 
మ. మదధారల్ జలధారంట్ల దొరుఁగన్ మత్తిల్లి లోహార్గళా
స్పదపాదంబులతోఁ బురోపవనికాభాగంబులం బొల్చు ను
న్మదనాగంబులు నందనోపవనికామధ్యంబులన్ శృంఖలా
స్పదబంధంబులతోడ నొప్పు విలయాభ్రశ్రేణిచందంబునన్. 99

ఉ. గండగళన్మదాంబువులు గ్రమ్మెడునేఱులు కుంభపీఠికల్
గండశిలల్ రజించిన మొగంబులఁ జేగుఱు జేగుఱుల్గ నా[6]
ఖండలుచేతఁ జెట్టుపలు గ్రాఁగక తప్పిననాఁటి నీలపుం
గొండలొకో యనంగఁ బురిఁ గ్రుమ్మరు నెల్లెడ భద్రనాగముల్. 100
 
గీ. శాలిహోత్రునిశక్తిఁ బక్షములు దునిసి
పోక మృష యని చూపఱు వొగడుచుండఁ
బక్కెరలతోడ వాహ్యాళి బయలుపడు(చు)[7]
గవి దగం బాఱు నగరి పాగాచయములు. 101
 
మ. వరణాభోగవిహారవాటములపై వర్తించు దేవాంగనల్
పరిశానీరములోనఁ గానఁబడు వప్రస్థాపితప్రస్ఫుర
ద్వర[8]రత్నంబులనీడు లోలిఁ గని తద్భావంబులన్[9] సంఘటిం
తురు దర్వీకరరాజమస్తకమణిస్తోమానురూపంబులన్. 102



  1. టలుగులు
  2. రెసఁగరాసఁగ
  3. విలుచుచొఁబుల
  4. శాంకలందిని విరాట్టంపుంజయ
  5. పువ్వు
  6. జెంగురులనా
  7. బయటపడు
  8. ద్ధర
  9. విగనిల్చుద్భావందులున్