పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. తిరిపెపుఁ గాని పొందొకటి[1] దేహమునం గొద యొక్కటయ్యు ద
గ్గఱు నను నంచుఁ దా మ[2][3]కరకచ్ఛపపద్మవరాంగలక్ష్మి ని
ర్భరతరరాగ మొప్పఁ బురి బాహ్యవనంబుల నిల్చె నట్ల యౌ
సరసులఁ జేరు కమ్మవిరి చాలదె[4] యొక్కదినంబు లెక్కకున్. 90
 
శా. మాకందీసమనోమరందముల తేమల్ సోఁకుచుం బుష్పితా
శోకానోకహవాటముల్ దఱియుచున్ శుంభత్తమాలాటవీ
ప్రాకామ్యంబులు సూచుచుం బొలయు నొప్పనే వీటిపై నందనా
నీకాంతర్వసుధానిరంతరచరన్నిస్సంద్ర[5]వాతూలముల్. 91
 
సీ. వేదవేదాంతాది విద్యావిశేషత
వనజాతసంభవు వినిమయములొ
భాసురభోగసౌభాగ్యభాగ్యోన్నతి[6]
వృత్రారి మాఱట విగ్రహములొ
బహుధనరత్నసంపాదనాసంపత్తి
యక్షనాయకుని ప్రత్యక్షతనులొ
ప్రకటబాహాబలప్రాభవప్రౌఢిమ
బలభద్రు సంబంధ బాంధవములొ
ఆ. యనఁగఁ దత్పురంబునను ధరామరులును
క్షత్రవరులు నూరుసంభవులును
సరవి సవరవర్ణజనులు మహోన్నతిఁ
బొలుతు రనుపమానభూతిఁ దనర. 92
 
చ. క్రతుశతకంబు శాస్త్రవిధి గైకొని సేయని బ్రాహ్మణుండు సం
తతమును శస్త్రనైపుణి నుదారత నొందని పార్థివుండు నీ
హితమతిఁ గోటికిం బడగ యెత్తని వైశ్యుఁడు బాహువిక్రమ
ప్రతిభ దొఱంగు శూద్రుఁడును బన్నిదమాడిన లేఁడు వీటిలోన్. 93



  1. జొనిహదూకలు
  2. ద గరునకునంచు దా(వా)మ
  3. “తిరపెవు జోగిహామికల దేహమునం గొద యొక్కటయ్యె సాగరునకు నంచుఁ దామ”
  4. చాపదె
  5. న్నీరంధ్ర; నిర్తంధ్ర
  6. భోగోన్నతి