పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. మగఁటిమి నింద్రనందనుని మాఱటరూపులు నిక్కువంపు సో
యగమునఁ బుష్పసాయకునియన్నలుఁ దమ్ములు ధైర్యసంపదన్
నగపతి జోడుకోడెలు ఘనంబగు నీవులఁ జందమామ లై
తెగువ లనం బురంబు నరదేవకుమారులు వొల్తు రున్నతిన్. 94

చ. చిలుకలయొప్పు క్రొమ్మెఱుఁగు చెన్ను పికప్రకరంబు చెల్వ మం
చల గరువంబు తుమ్మెదల చక్కదనంబును గూర్చి తెచ్చి యి
ప్పలుకులు మేనుఁదీగెలును బాటలు నాటలు గుంతలంబులున్
నలువ సృజించెనాఁ బురమునం గనుపట్టుదు రబ్జలోచనల్. 95

ఉ. కన్నులు గండుమీలకును గౌనులు సింహకిశోరరాజికిం
జన్నులు చక్రవాకఖగసంతతికిన్ నడయాడు టంచకుం[1]
జెన్నులు చిత్రరూపులకుఁ జేర్తురుపో యల సంయమంబుతో[2]
నన్నగరీవిలాసినులు హారి[3]మనోహరరూపవైఖరిన్. 96
 
ఉ. పెట్టనిసొమ్ము మోములకుఁ బిన్నట నవ్వులు మాటనేరుపుల్
పుట్టిన యిండ్లు తీపులకుఁ బుష్పశరాసను నూఁతపట్టు లే
పట్టునఁ గల్కి[4] కన్గొనలు బావమునం బరికించి చూడ న
ప్పట్టణభూమి రోచెలుల వాటిక[5] లేఁజిగురాకుఁబోండ్లకున్. 97
 
సీ. మవ్వంపుఁ గ్రొవ్విరి మల్లెలకాంతికిఁ
గలికిలేనవ్వులు గలు పమరిచి[6]
విచ్చిన చెంగల్వవిరుల నెత్తావికి
నిట్టూర్పు వలపులు నెలవుకొలిపి
మిగులంగఁ జవియైనపొగడపూఁ[7]దేనియ
కచ్చంపుఁ పలుకుతీ పప్పలించి
పురణించు[8] మించు లేఁబొఱల రాగమునకుఁ
జేతులకెంజాయఁ జేరఁద్రోసి[9]



  1. నంచకున్
  2. సయరీంబుతో
  3. హార
  4. పట్టునంగరి
  5. పట్టునళూలు రోచెలుల వట్టిమచూ
  6. పరిరీచి
  7. యైనబొగడపూ
  8. పురదించు
  9. జరద్రోసి