పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. కలమసస్యవనంబులు గాచు దంట
వెలఁదుకల[1] సోయగంబులే ములుకులుగను
గూర్చి తరుణాధ్వనీనుల[2] గుండె లవియ
వ్రేయు మరుఁడను తక్కరివింటిజోదు[3]. 86
 
సీ. పండ్లవ్రేఁగున వీఁగఁబడుమాదిఫలముల
కలిమి కప్రంబుల చెలిమి దడవ
నిండంగఁ బండిన నిమ్మల సామగ్రి
శృంగబేరమ్ముల చెలువు మెఱయ
ముదిరినయనఁటులఁ బొదలు[4] సారస్యంబు
ఖండశర్కరల చక్కటులు వెదుకఁ
గావు తట్టినను నీకడుములవిభవంబు
భోజనోత్సవముల పొందు లరయ
తే. దింప బరువైన పోఁకబోదియల పెంపు
వెల్ల[5]నాకుల సేమంబు విరికొనంగ
వఱలుఁ దద్దయు నప్పురవరము చుట్టు
కొని తనర్చెడు నందనవనచయంబు. 87
 
చ. రవి యుదయించి యెత్తి పయిరాకకు బెగ్గిలి యిర్లు మన్కికై[6]
యవనిజముల్[7] శరణ్యమని యాడిన లో నెడ మిచ్చి[8] నిల్పె నా
(రవి)కిరణాళికిం దఱిసిరా నవకాశము నీక చీఁకటుల్
గవియఁగ నుండు నెంతయుఁ బగళ్ళును[9] నప్పురి నందనావళుల్. 88
 
చ. పలుకుల నేర్పు చిల్కలకుఁ బాటల తిన్నదనంబు గండుఁగో
యిలలకు మందయానముల యెత్తు నెమిళ్ళకు వేణియొప్పిదం
బలులకుఁ బంచి వెట్టఁదగు నౌఁ బురిలేమలు కానినాటికిం
గలుగవె యన్యమైన విహగంబులయందుల నివ్విలాసముల్. 89



  1. పంట వేవిమెతల
  2. కరుణి ధనినుల
  3. శక్కవి వింటివెవిది
  4. బోదెల
  5. వెల
  6. యుం
  7. బవిసితముల్
  8. మిచ్చ
  9. న(గ)