పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జేయు నెవ్వఁడు రంగసీమంబుగా జిహ్వ
కాంచలం బఖిలవిద్యానటికిని
బ్రకటించు నెవ్వఁడు పాదుగాఁ గడకంటి
వలఁతిచూపులు కృపావల్లికలకు
తే వాఁడు నుతిసేయఁగాఁదగు వైరివీర
మానవాధీశమేఘఝంఝానిలుండు
మహిమ ముడియములోకయామాత్యసుతుఁడు
మానధన్యుండు పెదతిమ్మమంత్రి ఘనుఁడు. 56

క. వీరలలోఁ గృతినాథుఁడు
ధారాధరవాహ(నేందు)[1] ధారాధర మం
దారసమదానశూరుఁడు
ధీరాగ్రేసరుఁడు బాచధీమణి వెలసెన్. 57
 
సీ. పాలించఁ బ్రజలెల్లఁ బ్రస్తుతింపఁగ నబ్ధి
వేష్టీతాశేషపృథ్వీతలంబు
నిలిపె నిశ్చలమనోనీరజాసనమున
పద్మలోచన పాదపద్మయుగళి
సదనముల్ గావించె శక్తి ధాత్రీపాలి
కహిసింహశార్దులసహితగుహలు
విడియించె సత్కీర్తి విమలేందుముఖి సప్త
జలధిమధ్యక్షితి[2] వలయసీమ
తే. నతఁడు బయకారరామదండాధినాథ
రాజ్యలక్ష్మీశుకీపద్మరాగరత్న
పంజరాయితఫణిసార్వభౌమదీర్ఘ
బాహుపీరుండు లోకేంద్రు భాస్కరుండు.


  1. ధారాధర రాజ ()
  2. మద్వేష్టిత