పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యేమంత్రి హస్తంబు హితపురోహితమిత్ర
కవిరాజకోటికిఁ గల్పశాలి
యేమంత్రి కైశ్వర్యహేతువుల్ ముడివేము
లాగ్రవారశతోత్తరాస్త్యుపాస్తు[1]
తే. లతనిఁ గొనయాడఁ దగు ననారతనితీర్ణ
మతివిశేషప్రతాపసామ్రాజ్యభోగ
విజితరాధేయజీవారవిందబృంద
బాంధవేంద్రుండు లోకయభాస్కరుండు. 52
 
మ. మహితత్యాగధురీణతాపహసితామర్త్యాగ రత్నాకర
గ్రహరాజాత్మజ రాజరాజశిబిరాకాచంద్రజీమూతుఁడై
వహితో లోకయనాగఁ డిచ్చును మనోవాంఛానుకూలార్థముల్
బహుమానంబుగ సత్కవీశ్వరులకుం బ్రఖ్యాతచారిత్రుఁడై. 53

మ. స్మరసంకాశుఁడు లోకమంత్రి చినతిమ్మయ్యప్రధానేంద్రు స
త్వర ధాటీపటహారవశ్రవణధావద్వైరికాంతాళి కా
భరణాంగ ప్రకటప్రభాకర రజోభాతిం[2] బ్రతీప్సించు బం
ధురతన్ ఘోటకఘోటికాఖురపుటోద్ధూతోర్వరారేణువుల్. 54

మ. బహుధారీతులఁ బ్రస్తుతింతురు బుధుల్ భాషావిశేషాహిపున్
మహిళామన్మథు భైరవేశ్వరు మహామంత్రీశు సంధ్యాముహు
ర్ముహురానర్తితశర్వరీశ్వరకళామూర్ధావతంసాపగా
లహరీ(జా)త ఘుమంఘుమారవిశాలప్రౌఢవాగ్వైఖరిన్. 55

సీ. కావించె నెవ్వండు కట్టుమెట్టుగ హస్త
తలను సంతతదాతృతాసురభికిఁ
బాటించె నెవ్వండు వల్వలంబుగ మాన
సంబు గోవిందాంఘ్రిజలజమునకుఁ



  1. శతోత్తర పెద్దఆత్తు
  2. గవిరి ప్రకృత కరజోభాతిన్