పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. వెలుచు నెవ్వని కీర్తి
గళమిళద్గరళోగ్రకల్మషంబుఁ
దొలఁచు నెవ్వనికీర్తి తుహినాంశుమండలి
లగ్నీభవద్గాఢలాంఛనంబు
దుడుచు నెవ్వనికీర్తి దుగ్ధాబ్ధిమధ్యస్థ
కైటభాంతకు[1]దేహకాళిమంబుఁ
గలఁచు నెవ్వనికీర్తి కకుబంతవేదండ
గండసరద్దానకర్దమంబు
తే. వాఁడు నుతిసేయఁగాఁదగు వైరివీర
నృపకులాధీశ[2] సీమంతినీలరామ
హారిసీమంతసిందూరహారి శౌర్య
ధనుఁడు లోకయయెల్లప్రధానఘనుఁడు. 49
 
మ. వితతప్రక్రియ లోకమంత్రిమణి గోవిందప్రధానోత్తమో
ద్ధితధాటీసమయోగ్రఘోటకధురోద్యద్ధారుణీరేణుశో
షితపాథోధికి సంతరించు సుజనక్షేమంబు గంధేభసం
తతిభూత్కారవినిర్గతాంబువిలసత్కల్లోలినీవ్రాతముల్. 50

ఉ. అన్నలు దమ్ములుం దను మహానిధిగా గణుతింప నిత్యసం
పన్నత భోగభాగ్యముల భాస్కరమంత్రి ప్రసిద్ధి కెక్కె న
త్యున్నతకీర్తి వల్లిక[3] సముత్సుకతం దశదిక్తటంబులన్
సన్నుతిఁ బ్రాఁకు వేఁకువఁ దుషారమరీచి మహాఫలంబుగన్. 51
 
సీ. ఏమంత్రి కిలువేల్పు సోమశేఖరుపత్ని
చముడేశ్వరీ పూర్ణచంద్రవదన
యేమంత్రి హృద్దివ్య[4]హేమపీఠంబున
భాసిల్లు శ్రీరామభద్రమూర్తి



  1. దుగ్ధాబ్ధిమధ్యసత్కైటభాంతకు
  2. ధారుణికులాధీశ
  3. వనిత
  4. చాటదివ్య