పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ఆ మునితిలకుని కులమున
భూమీశ్వర[1] దండనాథపురుహూతుఁడు సం
గ్రామార్జునుండును
హేమధరాధరుఁడు[2] నరచురీంద్రుఁడు పుట్టెన్. 24
 
క. ఆ మంత్రిశేఖరునకును
శ్రీమంతుఁడు పుట్టె నారసింహామాత్య
గ్రామణి వితరణగుణచిం
తామణి గంభీరతాసుధాజలనిధియై. 25

వ. ఆ ప్రధానదేవేంద్రున కావాసంబు — 26

సీ. రచితాగ్ర[3]సంచంద్రజాననాస్నేహ
సిక్తసిద్ధాంగనాసముదయంబు
గోపురప్రాకారకుడ్యకీలిత రత్న
కిరణారుణీకృతాంబరతలంబు
నందీశవచనప్రణాళీగళద్వారి
సంవర్ధమానసస్యవ్రజంబు
చముడేశ్వరీశిరశ్చంద్రమః కందళీ
చంద్రికాంసధౌతసౌధవీథి
తే. లకుచపిచుమందమాకందవకుళకుంద
చందనాశోకశమ్యాకసరళతిలక
నీపఖర్జూరికారామనిందనీయ
నందనోద్యానవాటంబు నందవరము. 27
 
ఈనందవర మెక్కడిదో స్పష్టంగా తెలియటం లేదు. సముద్రతీరాంధ్రదేశంలో (విశాఖపట్టణ పరిసరాల్లో) ఒక నందవరం ఉన్నట్లు తెలుస్తోంది. ముడియం అగ్రహారం మాత్రం కడప మండలంలో జమ్మలమడక తాలూకాలో ఉంది.

క. ఆ నందవరపురంబున
నానందితబంధుమిత్రులై గుణధనులై
యేనూరిండ్ల గృహస్థులు
దీవిదు లుండుదురు కాకతీపతివిభుడై. 28



  1. భూమాశర
  2. హిమధరధరుఁడు
  3. రజతాద్రి