పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. వీరు త్రయోదశగోత్రో
ద్ధారకు లన్యోన్యబంధుతావిస్రంభో
దారులు పారావారగ
భీరులు వెలయుదురు పాపభీరులు ఘనులై. 29

క. వారలలో వసుధాస్థలిఁ[1]
బేరుం బెంపును వహించి పృథుసంబంధో
దారులు శ్రీవత్సముని
స్ఫారాన్వయజాతసదనశతకం బమరున్. 30
 
శా. ఆనూఱిండ్ల సగోత్రజుల్ బుధులు నిత్యంబుం దనుం బ్రేమ స
న్మానింపంగను నారసింహమహిభృన్మంత్రీశుఁ డత్యంతముం
దీనాళిన్[2] సకలార్థసంపదలలోఁ దేలింపుచున్[3] దాన కా
నీనుండై కడు మంతు కెక్కె ధర నిర్ణిద్రోరుసత్కీర్తియై. 31
 
క. ఆనారసింహునకు ల
క్ష్మీనాథస్మృతి సనాథ చిత్తాబ్జునకున్
భూనాథమాన్యుఁ డురు స
న్మానాధికుఁ డగుచు లక్కమంత్రి జనించెన్. 32

క. పొందుగ లక్కనకును బెం
పొందిన సతి బేచమాంబ కుదయించిరి సం
క్రందననిభ విభవులు గో
విందుఁడు నన్నప్ప బాచవిభుఁడును నెలమిన్. 33

సీ. శేషాహిమూర్థాభిషిక్తాంగనిర్మోక
కలితఖండముల కంచులిక దొడివి
దిక్కుంభికుంభసందీప్త[4][5]దేశంబుల
మహితతాండవవిభ్రమంబు చూపి



  1. సరి
  2. దీనాళిం
  3. నానందింపుచున్
  4. చిటార్తు
  5. దిక్కుంభినీకుంభదీప్త