పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదలుగాఁ గల పదార్ధంబు లొసంగి యనిపిన నేను నట్ల చేసెదనని మన్నిక దోఁచి మజ్జనకరచితంబగు నీ మహాప్రబంధమునకు విక్రమక్రమాభిరాముండును నగణ్యపుణ్యప్రావీణ్యుండును సంతతోదారస్ఫారగుణనిర్భర్త్సితతారాధీశ్వరాంబునిధినీరదుండును గర్ణాటకసింహాసనసామ్రాజ్యలక్ష్మీసార్వభౌమకారుణ్యలబ్ధకొండవీటిప్రముఖనిఖిలదుర్గాధిపత్యాభిరామజయకారారామప్రధానసుత్రానుసర్వసర్వంసహాభారభరణసందుగణదక్షిణదక్షిణభుజాస్తంభుండును మహితమణిప్రభాపూరస్ఫారందకటకాంగుళీయకకంకణకంఠమాలికాభరణభాసితుండును ననన్యసామాన్యలావణ్యతృణీకృతపంచబాణుండును దౌవారికాహూయమానావనినాథరాయబారామాత్యోదగ్రపరస్పరవ్యాహారసంకులభవనబహిర్ద్వారుండును మదాంధసింధురగండమండలసృతదానధారాగంధాఘ్రాణాసంహృతాలూన[1]ఖలీనకరకాణకరవిషాణఘోషభీషణసుందురోపకంఠుండును రాకాపూర్ణచంద్రాననాకంకణాలంకారలలితకరతాలవృంతోద్ధూతమారుతచరితహరినీలనీలకుంతలుండును సస్యసంతానాధీ[2]శ్వరుండును బంధరుతరకులోద్ధారకుండును రాయప్రధానాగ్రేసరుండును కసువమాంబాగర్భక్షీరాబ్ధిమహాహ్లాదకారణసంపూర్ణచంద్రుండును శ్రీవత్సగోత్రపవిత్రుండును నాన్వలాయనసూత్రుండును నగు ముడియము భాస్కరామాత్యశేఖరుం బతిగా నొనర్చి కావ్యాదిమంగళాచారంబుగాఁ దద్వంశావతారం బభివర్ణించెద. 22
 

కృతిపతి వంశావతారవర్ణనము


శా. శ్రీవత్సాఖ్యమహామునీంద్రునిఁ గృపాశిష్టాంతరంగుం దపః
ప్రావీణ్యాదికు నిశ్చలామల[3]మనోరాజీవవిభ్రాజిత
శ్రీవామాధిపుఁ బుణ్యకీర్తనుఁ బ్రశంసింపం దగున్ ధన్యునిన్
దేవేంద్రాదినుతప్రభావమహాధిష్ఠానచారిత్రునిన్. 23



  1. సంహృతతంటాన
  2. నిస్వనంకానాటీ
  3. నిశలామన్రా