పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృతిపతిత్వనిర్ణయము


సీ. తన కీర్తిలతకు నున్మత్తదిగ్వేదండ
గండమండలి కుడుంగంబు గాఁగఁ
దన కర మక్షుద్రతరరాజ్యలక్ష్మికి
విహరణప్రాసాదవేది గాఁగఁ
దన కటాక్షము దీనదారిద్ర్యముద్రాంధ
కారభాస్కరకరోత్కరము గాఁగఁ
దనహేతి రిపురాజవనజాననానేత్ర
నవబాష్పసలిలప్రణాళి గాఁగఁ
తే. దనరు మహనీయదానవిద్యావినోద
వంది[1] (వారి)ద మందారవనధిధనద
సోమజీమూతవాహనకామధేను
భానుసూనుండు ముడియము భాస్కరుండు. 18
 
మ. హరిణాంకోపలజాలకీలితవిశాలాస్థానభద్రాసనో
పరిభాగంబున రాయబారులు సుధీపౌరాణికుల్ మేదినీ
శ్వరులున్ సత్కవులుం బ్రధానులు నటుల్ వారాంగనల్ గొల్వఁగా
హరిశౌర్యుండగు లోకయప్రభుని బాచామాత్యుఁ డత్యున్నతిన్. 19

భాస్కరుడు సంస్థానాధీశ్వరు డనడానికి ఆధారాలు కనపడటం లేదు. అతిశయోక్తులు వ్రాయటం ఆంధ్రకవులకు అలవాటు కాబట్టి కృతిపతి వంశవర్ణనలో చాలావిషయాలు అతిశయోక్తులై యుండవచ్చు. అమాత్యపదం గౌరవపదంగా (వంశపారంపర్యంగా వచ్చే బిరుదులాగ) పెట్టుకొనే ఆచారం చాలా పురాతన మైనది. కాబట్టి ఈతడు దండనాథుడై ఉండాలి.

వ. పేరోలగంబుండి నన్ను నారనామాత్యుం బిలిపించి బహుమానపురస్సరంబుగా నర్ధాసనంబునఁ గూర్చుండ నిడుకొని యిట్లనియె. 20

క. నీజనకుఁ డుదయనోదయ
మోజం గావించె సురుచిరోక్తుల నది సం
యోజింపు నా పేరట
భూజననుత నారధీర పుణ్యవిచారా. 21

వ. అని సబహుమానంబుగా సారఘనసారామోదమేదురంబగు గంధసారంబును బసిండికోరఁ గర్పూరతాంబూలంబును దివ్యాంబరాభరణంబులు



  1. వంద