పుట:ఉత్తరహరివంశము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

39


వఱడు లఱచె, నుల్కలు వడె,
నెఱి చెడి సురగాలి విసరె నిలువక పెలుచన్.

24


గీ.

అట్టియెడ సైన్య మెల్లఁ గట్టాయితంబు
చేసి [1]యేనును గాండీవశింజినీని
నాదమేదురభూనభోంతరుఁడ నగుచు
[2]నమ్మహీదేవుని గృహాంగణమ్మునందు.

25


ఉ.

ఉండునెడన్ భయంబున మహోద్దతిఁ గొందఱు వచ్చిపట్టుప
ట్టుం డిట తెండు పొండని కడున్ రభసంబున నాడుమాటలుం
బండియుఁ బొల్లవోయెనని బ్రాహ్మణి లోపల నేడ్పు నేడ్చు నొం
డొండ కడంగి తచ్ఛిశువు నుద్భవమున్ మరణంబు దెల్పినన్.

26


స్రగ్ధర.

గాండీవారావఝంపాఘటితభయదివౌకఃపురాంతఃపురంధ్రీ
గండాభోగశ్రమాంభఃకణకలుషితగంగాతరంగాభిషంగా
ఖండాస్మత్కాండపాళీకబళితసకలాకాశసీమానిశాంతో
ద్దండాతిక్రాంతగర్భాంతకయమభటసంతానముం గాననైతిన్.

27


గీ.

పోయె బాలుండు యదువృష్ణిభోజబలముఁ
జిన్నవోయెను జూడ వచ్చినజనంబు
డించి పోయె మదీయగాండివము లజ్జ
వోయెఁ గొనిపోయె [3]భూసురపుత్రు జముఁడు.

28


వ.

ఇవ్విధంబున గాండివమ్ములావు వమ్మయినం గ్రమ్మునుమ్మలికంబున విన్న
నైన నన్నుం జూచి యవ్విప్రుండు.

29

నిజకుమారుని యముఁ డపహరింపఁగా బ్రాహ్మణుఁ డర్జునుని దూఱుట

క.

ఓపార్థ! నిను నమ్మితి
బాపని రక్షింప కిట్ల పార్థుఁడ వైతే
నాపాలిపారిజాతము
గోపాలకచక్రవర్తిఁ గొని రానైతిన్.

30
  1. యేను గాండివము శింజినినినాద, భరితబధరితభూ
  2. కణఁగి ధరణిసురునిగృహాంగణమునందు
  3. ఁగడసారెలోయె, శవము