పుట:ఉత్తరహరివంశము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ఉత్తరహరివంశము


ననువగు నెల్లి భూసురకులాగ్రణి! యిన్ని విధంబులందు నీ
తనయునిఁ గాతు, నన్న హరి దప్పక చూచి యతండు దీనుఁడై.

18


ఉ.

నేఁడు ప్రసూతికాలమున నీవు గదాధర! మద్గృహంబునన్
వాఁడిమితోడ నుండి జము వాకిలి గట్టి మదీయసంతతిం
బోఁడిమితోడఁ గాచి ననుఁ బుణ్యునిఁ జేసినఁగాక యింతలో
మాడిన నేమి చేసెదపు మంత్రపునీళులు సల్లవచ్చునే.

19

అర్జునుఁడు విప్రార్భకరక్షణార్థము తా నరుగఁ గోరుట

క.

అనవుడు నెద జింతిల్లిన
వనజాక్షునితెఱఁ గెఱింగి వసుధామరుప్రా
ర్థన దీర్ప నన్నుఁ బనుపుము
పనివినియెద నంది లావుఁ బంతము మెఱయన్.

20


మ.

విని విశ్వంభరుఁ డల్ల నవ్వి కరుణావిర్భూతచేతస్కుఁడై
ననుఁ బ్రీతిం గడగంటఁ జూచి విజయా! నాచేత [1]నెబ్భంగి నే
పని యైనం గడతేఱుఁగాని యిది నీ పంతంబులం దీఱునే
యనిన్న్ మో మరవాంచితిన్ వినయలజ్జాయత్తచిత్తుండనై.

21


మ.

ధరణిదేవుని దైన్యమున్ నిజమనోధర్మక్రియానిష్ఠయున్ ,
విర[2]సోల్లాసమదాననావనతియున్ వీక్షించి పద్మాక్షుఁడు
ద్ధురతం దోడ్కొనిపొమ్ము రాముఁడునుఁ బ్రద్యుమ్నుండుఁ దక్కం బురం
దరపుత్త్రా! మన వీటిలోనఁ గలయోధవ్రాతమున్ నావుడున్.

22


మ.

యదువృష్ణ్యంధకభోజసైన్యములతో నభ్రంకషారావభి
న్నదిగంతద్వీపమండలుండ నయి కృష్ణశ్రీపందాభోజముల్
మదిలో నిల్పి మహీసురావసధరమ్య గ్రామమధ్యంబునం
బదిలుండైతిఁ బ్రసూతివేళ యమునిం బ్రత్యర్థి రాఁ జూచుచున్.

23


క.

ఎఱసంజ దాసనంబుల
తెఱఁగయ్యెను, గూబ లెల్ల దెసలఁ జెలంగెన్.

  1. నీచేత నే
  2. శో