పుట:ఉత్తరహరివంశము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ఉత్తరహరివంశము


చ.

పిలిచితి నన్న నిన్ను నతిభీతుఁడ విప్రుఁడ నమ్మినాఁడ నీ
పలు కనృతంబు గాఁదగునె పాఱెడుబండ్లకుఁ గాళ్లుసాఁపఁగా
నలవడు నన్న పోటుమగఁడై యిటు చేసితిగాక యాసతో
నిలుతు మురారి నన్నచట నీళుల ముంచినఁ బాల ముంచినన్.

31


క.

మే లైననుఁ గీ డైనను
నాలవపా [1]లాఫలము ధనంజయ రక్షా
శీలునకుఁ జేరు నీ వీ
బాలుని రక్షింప [2]వట్టిఫల మందఁదగున్.

32


క.

నీవేమి సేయు దీగాం
డీవము నీ కిచ్చి [3]యమ్ము డెప్పర మైనన్
లావుగల దంచుఁ బలికిన
[4]పావకు చేఁగాదె కోలుపడితిఁ గుమారున్.

33


గీ.

అనుచు ననుచారియై విప్రుఁ డరుగుదేరఁ
దేర గాండివ మిడి యస్మదీయమహిమ
మహి మడుంగ మడుంగగుమనసు మాయ
మాయ గన్నులఁ గ్రమ్మఁ గ్రమ్మఱితి నేను.

34


క.

ఈరూపున బొలివోయిన
బీరముతో వృష్ణిభోజవిభు లేతేరన్
ద్వారవతి కరిగి నిలిచితి
నారాయణు నెదుర ఖేదనమ్రముఖుఁడ నై.

35

విప్రకుమారుల నుజ్జీవింపఁజేయుటకై కృష్ణుఁడు పార్థసహితముగాఁ బోవుట

సీ.

అట్లున్న నన్ను నొయ్యన గారవించి యా
                 భూసురోత్తముఁ జాల బుజ్జగించి
నీకుమారకుల నేలోకంబునం దున్న
                 దెత్తు; నీ కిం తేల ధృతి గలంగ?

  1. లరయఁగా
  2. నట్టిపల మందఁదగున్
  3. యితఁడు....గలడంచు; యిమ్ము
  4. భావము