పుట:ఉత్తరహరివంశము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఉత్తరహరివంశము


[1]మాలిని.

జలధిగిరినివాసా చంచదుద్యద్వికాసా
విలసితదరహాసా వృత్తసచ్చిద్విలాసా
ప్రళయబహుళరూపా పండితాంతఃప్రదీపా
దళితవివిధపాపా దైత్యసంహారికోపా.

191


[2]గద్యము.

ఇది శ్రీ మదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధానవి
రాజితిక్కనసోమయాజీప్రణీతం బైన శ్రీమహాభారతకధానంతరంబున శ్రీమత్సకల
భాషాభూషణసాహిత్యరసపోషణసంవిధానచక్రవర్తి సంపూర్ణకీర్తి నవీనగుణసనాథ
నాచనసోమనాథ ప్రణితంబైన యుత్తరహరివంశంబునందుఁ బ్రథమాశ్వాసము.

  1. ఈ మాలిని చతుర్ధాశ్వాసాంతమందున్నది.
  2. వ్రాఁతప్రతులలోఁ బ్రథమాశ్వాసము సంపూర్ణము గాకుండుటచే శ్రీ కం. వీ. గారో మఱెవరో వచనమునుఁ క్రొత్తగా రచించియు, 5, 6 ఆశ్వాసముల నుండి యీయాశ్వాసాంతపద్యములఁ గయికొనియు సంపూర్ణపఱచియుందురు.