పుట:ఉత్తరహరివంశము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

29


ఉ.

అక్కమలాయతాక్షి నరకాసురుపై సరి నేసె బాణముల్
పెక్కుదెఱంగు లయ్యసుర భీకరుఁడై నడు మాఱుతూపులన్
గ్రక్కునఁ బార్శ్వ మేడువిశిఖంబుల నొంచిన సత్యభామ గెం
పెక్కిన మోము లేనగవుటీరికలం దళుకొత్త నత్తరిన్.

164


గీ.

[1]గొడుగు కామయు విల్లునుఁ బడగతోన
తుమురు సేసి రథ్యంబులఁ దునిమి వైచె
నతివ యతఁ డొండుకోదండ మందికొన్న
నఱకె వేఱె విల్లెత్తిన విఱుగ నేసె.

165


క.

గద విసరి వైచె నరకుఁడు
వదలక సతి దునిమె శక్తి వైచెను దితిజుం
డది ముదిత దుమురు సేసెను
దుదిఁ బరిఘము వైచె నతఁడు దొయ్యలి విఱిచెన్.

166


మ.

సతి దైతేయపతి న్నిశాతవిశిఖాసారంబుల న్నొంప దే
వతలున్ సంయములు న్నుతించిరి మఱి న్వామాక్షి తత్సూతు ను
దతి నేసెం [2]దల నేలఁగూల నొకటన్ దైత్యాంతకుం డిచ్చె లా
లితకంఠాభరణంబుతో నతివకునన్ లీలాపరీరంభమున్.

167


ఉ.

ఏఁచు [3]నుపేంద్రునిం బదక మిమ్మని రుక్మిణి మున్ను, దేవుఁడుం
బూఁచినపూఁవు దప్పుటకుఁ బోకులఁబోవుచునుండు నిమ్మెయిన్
డాఁచినసొమ్ము చేరె నిచటన్ మదిఁ గోరనిసత్యభామకున్
నోఁచినవారిసొమ్ము లవి నోమనివారికి వచ్చునే ధరన్.

168


వ.

ఇవ్విధంబున సత్యభామ చేసిన సంగరంబునకు సంతోషించి.

169


గీ.

చెలువచెక్కుల నెలకొన్న చెమట దుడిచి,
తరుణినుదుటఁ బైకొన్న కుంతలము లొత్తిఁ
రమణికుచమధ్యమునకు హారములు ద్రోచి
పొలఁతిపయ్యెదకొంగుపైఁ బొందుపఱిచి.

170


మ.

హరి యక్కామినిచేతివిల్లు గొని యేయం జొచ్చినన్ ధీరుఁడై
నరకుం డొండుశరాసనంబు గొని యన్యస్యందనం బెక్కి వే

  1. గొడగు
  2. దెగ నిండ గోల
  3. నుబ్రేమనీ(వీ)