పుట:ఉత్తరహరివంశము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

19

నిరోష్ఠ్యము

చ.

చని చని కాంచె నంత ఋషిసంహతి సారసకేసరాంతరా
సనసరసాళిసంగఁ దటచందనశాఖి చలత్తరంగఁ గాం
చనసరసీజలార్ద్రయతిసంచితసైకతలింగ గంగ నం
జనగిరి గాఢగంధగజసంగతశృం రథాంగ నత్తఱిన్.

106


క.

అనిమ్నగలోనఁ గృత
స్నాను లయి మునీంద్రు లమలినస్వాంతశరీ
రానూనమహిము లగుచును
దానవరిపుఁ గానఁ జనిరి ద్వారావతికిన్.

107


మ.

చని వా రందఱు దేవతారచితపంచక్ష్మాధరాంతస్థలం
బున నొప్పారెడువీడు చొచ్చి మన ముప్పొంగం[1]గ దాశార్హ నా
వినుతిం బొందుసభన్ నిషణ్ణులగుచున్ [2]విచ్చేయ శైనేయుఁ డా
సనపాద్యాది సపర్యలం దనుపఁగా సంప్రీతచేతస్కులై.

108


చ.

అచటికి దానవాంతకుఁడు నంతటిలోఁ జని యానుపూర్వితో
నుచితవిధోపచారముల నూఱటగాఁ గుశలానుయోగవా
క్యచతురత న్ముదం బెసఁగ నందఱ ధన్యులఁ జేసి భక్తి న
ప్రచలితుఁడయ్యె వారలు నుపాయనముల్ మునుసూపి పిమ్మటన్.

109

మునులు నరకుని యాగడములు శ్రీకృష్ణునకు విన్నవించుట

క.

నరకుఁడు యాగంబులకున్
జొరకుఁడు మీ రనుచు ఋత్విజుల నడుచుటయున్
సరకులఁ జూఱాడుటయును
వరకులకన్యకలఁ బట్టి వా డేఁగుటయున్.

110


వ.

విన్నపంబుచేసి తమ తెచ్చిన విధ్వస్తోపకరణంబులు విచ్చి చూపి.

111


మ.

 అది నాయుద్గమనీయవస్త్ర మది నాయాషాఢరాంభద్వయం
బది నాస్రుక్సువపాత్రవర్గ మది నాయజ్ఞోపవీత వ్రజం

  1. సుదాశార్హ
  2. వేవేగఁ బ్రద్యుమ్నుఁ డా