పుట:ఉత్తరహరివంశము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ఉత్తరహరివంశము


వ.

తదనంతరంబ.

101


సీ.

జడలు [1]కంపలు వట్టి జరగనీ కున్నచో
                 విడిపింప శిష్యుల వెదకువారు
జన్నిదంబులు కాలిసంకెలలై పడ్డఁ
                 దెగఁ దన్ని మిన్నక తిరుగువారు
ముందటిదిక్కూడి మొలత్రాడుఁ దవిలిన
                 తోఁక[2]గోచులవెంటఁ దూలువారు
దగ యెత్తి పోలేక దండంబు లటు వైచి
                 “హా విధీ" యని చేతు లార్చువారుఁ


తే.

గడవసంబుల మోఁదిన గలగువారు
వల్కలంబులు దోఁచిన వంగువారుఁ
జెఱలువోయినవారలఁ జీరువారు
నై మునీంద్రులు గలఁగి రయ్యాశ్రమమున.

102


చ.

నరకునిచేత నిత్తెఱఁగునం బరిభూతికి భాజనంబు లై
హరి కెఱిఁగింత మీబదరికాశ్రమ దుర్భరబాధ లంచు న
ప్పరమమునీంద్రు లందఱు గృపాపరతంత్రుని యాదవాన్వయాం
బురుహదివాకరుం గొలువఁ బోయిరి వేడుకతోడుపాటుగాన్.

103


గీ.

అరుగు నెడ భరద్వాజ కాశ్యప వసిష్ఠ
వామదేవ జాబాలి కణ్వ బృహదశ్వ
ధూమ్రముఖ్యులు దనుజారి తొల్లి చవులు
గన్నబదరీఫలంబులు కానుకలుగ.

104


క.

తెం డనుచు దుష్టదానవ
ఖండితయాగోపకరణఘనభారంబుల్
దెం డనుచు [3]వేగమే చను
దెం డనుచున్ శిష్యులకును దెలియఁ బలుకుచున్.

105
  1. క్రవ్వలు
  2. గోఁచు
  3. గూడరాఁ జ