పుట:ఉత్తరహరివంశము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

17


పునఁ బడునయ్య పేర్మి? యలపుం దగవుం దలపోయ కేల కూ
డనిపని సేయఁ [1]జొత్తు? వకటా వికటాచరణంబు పాడియే?

93


క.

మనుజాశను లట, బలు లట
మును లట, యాగంబు లట, నమో విశ్వసృజే
[2]విన మింతకు ము న్నెన్నఁడుఁ!
గని కని కొఱ్ఱెవ్వఁ డింటికంబము సేసెన్?

94


వ.

అనుటయు నద్దనుజుండు.

95


క.

ఏలిక నౌదు మఖాంశ
శ్రీలకు; నొరు దడవ నేల! శిర సుండగ మోఁ
కాలను సేసలు వెట్టుట
బేలుఁదనము గాక మీకుఁ బెద్దఱికంబే.

96


క.

త్రిదివసుఖమ్ము మఖమ్మున
గదియించుఫలంబుఁ దనకుఁ గాననిదయ్యం
బెదిరికి వర మిచ్చు ననుట
చదురే యతఁ డేఁగె మును దిశాపట్టముగాన్.

97


వ.

అనుటయు నమ్మునీంద్రులు విడియనాడం దలంచి యతని తోడ.

98


శా.

పాపాత్ముండవు దానవుండవు నినుం బాటించి యాగార్హుఁగాఁ
జేపట్టం దగునే మునీంద్రులకు? మాచేఁ జెల్ల దీకల్ల దు
ర్వ్యాపారంబులు ధర్మకర్మములలో వర్తించునే? నావుడుం
గోపాటోపగజంబు మానససరఃకోలాహలోత్సాహిగాన్.

99


చ.

తనపరివారముం బిలిచి దానవుఁ డాశ్రమసంభృతార్థముల్
గొనుఁడు పరంపరాకమునకున్ మును యజ్ఞపశువ్రజంబులం
దినుఁడు కుమారికావితతిఁ దెండు బలాత్కృతి నంచు నమ్మహా
మునులకు నెగ్గు చేసి మదమోహమునం దనవీటి కేఁగినన్.

100
  1. జూతు
  2. విన మెన్నఁడు మున్నిట్టివి కన మెన్నఁడు గోరవిట్టి కర్జము సేయన్.