పుట:ఉత్తరహరివంశము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఉత్తరహరివంశము


ర్పితుఁడై తచ్చతురంగరక్షకు హయగ్రీవున్ నిశుంభుం లొన
ర్చుతఱిం బంచజనున్ మురుం బనిచె ధీరుండై జగం బేలుచున్.

87


క.

ఆమురుఁడు రాక్షసకుల
స్వామి [1]సుకృతి వానిఁ జంప వచ్చుటకుఁ బరం
ధామపతి పుట్టె సుజన
క్షేమంకరుఁ డగుచు దేవకీగర్భమునన్.

88


క.

మురనరకాసురు లిరువురు
సుర లరిగెడుత్రోవ లుడిపి సుత్రామభయం
కరులై మునిగణమానస
సరోవరంబులు గలంచి చరియింతు రిలన్.

89

నరకాసుఁ డధ్వరభాగంబు లిం డని మునుల బాధించుట

మ.

ఒకనాఁ డూర్వశిమాటపొందు నరకుం డూహించి నాకాధినా
యకునిం దాపసముఖ్యు లధ్వరము చేయంబూని రావించుచో
టికి దాఁబోయి [2]ధరామరావతులు రెండింగొంటి మీ కెల్ల నే
లికనై యుండెద యాగభాగములు పాలింపన్ విభుం డయ్యెదన్.

90


శా.

పాశిం బాఱఁగఁ దోలి యంతకు దిశాపట్టంబు గావించి పూ
ర్వాశాధీశ్వరు వెన్నడిం జని ధనాధ్యక్షున్ విభాళించి కే
లీశస్త్రాస్త్రవిహారసార మెచటన్ లేకుండ నిర్మించితిన్
మీశాస్త్రంబుల నింక నెవ్వరి కగున్ మేలైన యజ్ఞాంశముల్.

91


క.

మ్రొక్కులకుఁ దగుదుఁ బూజల
కెక్కినమంత్రార్థవిధుల కెల్లం దగుదుం
బెక్కేల యేను వెలిగా
స్రుక్కక యాగముల కొకరు సొరఁ గలవారే.

92


చ.

అనుటయు సంయముల్ బదరికాశ్రమవాసులు గూడి వానికి
ట్లనిరి సురాధినాయకుఁడ యాగము లేలెడువాఁడుగాక లా

  1. బలుఁడు
  2. ధరామరేశ్వరుల దండిం బిల్చి (ధరామ రామరుల వెట్టింగొంటి)