పుట:ఉత్తరహరివంశము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

15


వ.

అని యొడంబడి యా వెలంది వీడ్కొలిపి యమరావతీపురంబునం దడవి
తడవి చక్కని కన్యకాజనంబుం బట్టించి తెప్పించి యందంద నందన పాదపంబులు
వెతికించి తెప్పించి యెనిమిదివేల యెనుంగులం గైకొని మాహిష్మతీపురంబునకు
వచ్చి మఱియును.

81


గీ.

త్వష్టకు నుదాహరకుఁ జతుర్దశి యనంగ
నొక్కకూఁతురు గలిగినయిక్కు వెఱిఁగి
[1]గంధగజరూపమునను నక్కన్యఁ దెచ్చి
కవసి నరకాసురుండు సౌఖ్యములఁ దేలి.

82


క.

నాకంబునయందును భూ
లోకంబునయందు ధనములు మణులు దైత్యా
నీకంబు దేర మంచివి
గైకొని యాచంద్రముఖికిఁ గానుక యిచ్చెన్.

83


వ.

వెండియు గంధర్వదేవమానుషకన్యకలం బదాఱువేలున్నూఱుగుర నప్సరో
గణంబు (లేడింటి) జెఱలుపట్టి తెచ్చి మణిపర్వతంబునం బురంబుచేసి కావలివెట్టి
కొని యుండెనట్టియెడ.

85


మ.

మురదైత్యుండు దపోవసానమున వైముఖ్యం బముఖ్యంబుగా
[2]వరదత్తాపరనామధేయమున దేవవ్రాతముం గిట్టి ము
ష్కరుఁడై కుండలముల్ హరించె నదితిం గారించి దైతేయు లె
వ్వరుఁ బూర్వంబున నింత చేయ రనుచున్ వారింత వారింపఁగన్.

86


క.

ఆకుండలములు నరకుని
జేకొమ్మని యిచ్చి యతనిచేఁ దాఁ బడసెన్
నాకొడుకులకుఁ బదుండ్రకు
నీకావలి యొసఁగు మనుచు నిచ్చలుఁ గొలువన్.

86


మ.

అతఁడున్ వారికి నాత్మరక్షయును గన్యారక్షయుం జేయనై
హితులం దోడుగఁబెట్టి యిచ్చే మహిలో నింపారఁ బ్రాగ్జ్యోతిషా

  1. కదిసి గంధర్వుఁ డనుచు నక్కన్వఁ దెచ్చి (కదిసి కందర్పురూపునం గన్యఁ దెచ్చి)
  2. వరదంతావళ