పుట:ఉత్తరహరివంశము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఉత్తరహరివంశము


జవ్వన మమ్ముకొన్న [1]గడసాని ననుం గవయం దలంచితే
పువ్వులు వేడుకైనఁ గడివోయిన[2]వాళ్ ముడువం[3]గవచ్చునే.

73


వ.

అనుటయు.

74


క.

అంజెదవుగాక ననుఁ జెం
తం జేరఁగనీక యెంత [4]దఱిఁగిన మిరియా
లుం జొన్నల సరిపోవే
లంజెతనములందుఁ గొమిరెలన్ గెలువ వటే.

75


గీ.

ఆనుడు నవ్వామలోచన యతనిఁజూచి
చిఱుతనగవుల ఱెప్పల సిగ్గు దేర్చి
నీవు రాజవు! మాటలు నిన్నుఁ గడవ
నాడ నేర్తునే, విన్నప మవధరింపు.

76


చ.

శతముఖుఁ డోడె నీవతనిసంపద కంతకు రాజవైతి త
చ్చతురవిలాసినీ[5]గణము సంతతసేవ యొనర్చు నీమనో
హితముగ నింక నేననఁగ నెంతటిదాన మహిన్ మహామునుల్
క్రతువులు సేయుచోటి కధికారివిగాని కొఱంత యేటికిన్?

77


క.

యాజకులు యజ్ఞభాగ
భ్రాజిష్ణునిఁ జేయ నిన్ను భావజ[6]సౌఖ్యా
వ్యాజపదరాజుఁ జేసెదఁ
దేజముసూ వలపు దెలుఁపు దెఱవల కెందున్.

78


వ.

అనుటయు నతండు.

79


చ.

అవునిది వోలు వాసవుఁడు నంతకుఁడున్ వరుణుండుఁ బార్వతీ
ధవసఖుఁడుం బ్రతాపమునఁ దత్పద మేలెద రంచు నిట్టినే
నవిహితయాగభాగము లహంకృతిమైఁ గొనకున్న నూర్వశీ
కవకవ నవ్వరే త్రిదశకాంతలు వింతల సేయు నాపనిన్!

80
  1. కడసారె
  2. వేన్ము
  3. దలంతురే
  4. దఱిని
  5. మణుల సంగతిసేవ యొనర్తు
  6. సుఖనీరాజ