పుట:ఉత్తరహరివంశము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ఉత్తరహరివంశము


గనువుపఱుచు గేదఁగిరే
కు నఖంబులఁ జీఱు [1]గులుకుఁ గోర్కులఁ దేలున్.

58


క.

అత్ఱఁ గంతయు నూర్వశి
చిత్తంబున నెఱిఁగి వాఁడు చేతోజాతా
యత్తుండై తనుఁ బిలువం
బుత్తెంచుట తెలిసి లోనఁ బూనినలజ్జన్.

59


ఉ.

తోరపుఁజన్నుదోయిపయి దొంగలిఱెప్పలదాఁచి చూపు నీ
హారము లేని క్రొమ్మెఱుఁగులై నిలువం గొలు వల్ల జొచ్చి య
చ్చేరువకంబముం గదిసి చిత్తరువో కరువో యనంగ గం
డారపుబొమ్మవోలె నచటం గద లించుక లేక యుండఁగన్.

60


ఉ.

ఆ లలితాంగిఁ జూచి నరకాసురుఁ డిట్లను బాకశాసనుం
డాలములో ననుం గదిసి యంతక పాశి కుబేరయుక్తుఁడై
తోలుపులం బడెన్ సతులు దోడనె డాఁగిరి దైత్యభీతలై
[2]ప్రోలు దొలంగి తేమిటికిఁ బొత్తులదానవు నీవు తొయ్యలీ.

61


ఉ.

నాకపురంబులో మెఱసి నందనకేళిఁ జరించి దివ్యకాం
తాకరతాలవృంతసముదాయసమీరము సోఁక రాజ్యముం
గైకొని నేఁడు దిగ్విజయగౌరవధన్యుఁడ నైన నాసభన్
నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు నిండునే.

62


మ.

అవె సుత్రామరథంబు; లల్లవె కుబేరానేకపశ్రేణు, ల
ల్లవె వార్ధీంద్రుతురంగమంబు; లవె ప్రేతాధీశవీరావళుల్
దవులం బాఱినఁ బట్టి తెచ్చి రనిలో దైతేయు [3]లేసొమ్ము లిం
దువిదా నీకుఁ బ్రియంబు? గైకొనుము నీయుల్లంబు దెల్లంబుగన్.

63


ఉ.

కౌఁగిటి కాస చేసి నొడికారితనంబున నిన్నుఁ దేల్చి రా
రాఁ గొఱగానివాఁడనయి రామలలో నగుబాటు దేను నీ
కేఁ గలుగంగ సంపదల కేల విచారము పద్మగంధి? నీ
లోఁగిటఁ జేర్పనే యుభయలోకసుఖంబులు నన్నుఁ బొందినన్.

64
  1. వొడలు గులుకుచు నిక్కున్ (మెచ్చున్)
  2. పోలఁ దొ
  3. లీసొమ్ము లం