పుట:ఉత్తరహరివంశము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

11

నరకాసురుఁ డూర్వశిని రావించి సంభాషించుట

ఉ.

ఊర్వశిఁ దోడితెమ్మనుచు నొక్కనిఁ బంపఁ బదుండ్రు వాఱి సౌ
పర్వణసౌధవీథుల యుపాంతములం దిరుగంగ నంతకుం
బూర్వసురేశ్వరుండు సురపుంగవుగద్దియమీఁద నుండి గం
ధర్వులపాట వించుఁ బ్రమదంబును బొందుచునున్న యత్తఱిన్.

54


క.

తడవం బోయిన దైత్యులు
పొడగని యూర్వశి, తొలంగిపో నేల? నినుం
దొడితెమ్మనె మారా; జదె
బడిబడి వచ్చెదరు వేగ పని విను మనినన్.

55


వ.

అజ్జోటి దిట్ట గావునం దలంకక వచ్చునప్పుడు మునుముట్టిన భయకార
ణంబున.

56


సీ.

తొడవు లూడ్చిననైనఁ దొయ్యలి[1]రూపుతోఁ
                 జిన్నవోయినపట్లు సెన్ను మీ[2]
విరులు పుచ్చినవైన వెలఁది పెన్నెఱతావిఁ
                 బాయనిజవ్వాది బయలు మెఱ [3]
బూత రాల్చిననైనఁ బొలఁతుక మైచాయ
                 గవుసెనలో నున్నక్రమము దెలు[4]
మడుఁగు మాసిననైన మగువ పిఱుందుసో
                 యగము చూపఱచిత్త మాఁకగొలు[5]


తే.

మురిపముల నుజ్జగించిన [6]ముగుదనడపు
గలికిచూపుల వీడ్కొన్న కన్నుఁగవయుఁ
జిఱునగవు నోసరించిన చిగురుమోవి
నింతి మది బీతి వెలు[7]పలి కెఱుక సేయ.

57


క.

దనుజేంద్రుఁ డాతలోదరిఁ
గనుఁగొని చొళ్ళెంబు నిమురుఁ గ్రమ్మనఁ బైకొం

  1. మేనిలో
  2. ఱు
  3. యు
  4. పు
  5. పు
  6. ముదురు
  7. వీడు టె