పుట:ఉత్తరహరివంశము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ఉత్తరహరివంశము


చ.

చను[1]మఱలందు పక్షమునఁ జక్షురుపాంతములందు ఱెప్పలన్
మునిఁగిన బాణజాలముల ముప్పిరిగొన్న భయంబు ఖేదమున్
మనమున నిండఁగాఁ దొడఁగి మార్కొనలేక కుబేరుఁ డేఁగె న
ద్దనుజుల నింత చేసినవిధాతకు గో డనఁబోవు చాడ్పునన్.

42


గీ.

మఱియు దానవనైన్యంబు మాఱులేక
యొప్పి తప్పిన నిర్జరయోధవరులఁ
దోలి తొప్పఱవెట్ట నింద్రుండు నిలిచె
బవరమున నొక్కరుఁడు [2]నేఁదుపల్లువోలె.

43


ఉ.

దేవత లెల్లఁ బాఱిన మదిన్ రణకౌతుక ముల్లసిల్ల నై
రావణదంతి నెక్కి నిజరాజితకార్ముకఘోరశింజినీ
రావము సూప నేపునఁ బురందరుతో నరకుం డెదిర్చె నా
నావిధసింహనాదుఁడయి నాగముపైఁ జనుసింగమో యనన్.

44


మ.

ఇటురా! చూతువు చేతిలా వనుచు మ్రోయించెన్ గుణం బప్పు డు
త్కటసంగ్రా[3]మము సెల్ల నిద్దఱకు దైత్యస్వామి నారాచమొ
క్క[4]టి యేసెం దెగ నిండఁ జాఁపి హరిమైగాఁడన్ సురేంద్రుండు నె
త్తుట జొత్తిల్లుచు మూర్ఛవోయి కరిపైఁ దూలెన్ విచైతన్యుఁడై.

45


సీ.

అంతలోన[5]న తేఱి యమరేంద్రుఁ డెనిమిది
                 బాణంబు లతనిపైఁ బఱపి మఱియు
రథము డెబ్బదిట సారథిఁ దొమ్మిదిట నేసి
                 పడఁగ శాతక్షురప్రమున నఱకి
సూతు నంతట శితాశుగపరంపరచేత
                 జముఁ గూడ ననిచి రథ్యముల నాల్గు
శరములఁ జంపి తచ్చాపంబు క్రూరభ
                 ల్లమున ఖండించిన నమరవైరి


తే.

విరథుఁడై చేతఁ గరవాలు వెలుఁగుచుండ
దాఁటి గజకుంభములఁ గాలదన్ని వజ్రి

  1. మొన
  2. నేడు
  3. రంభమునూప నీడుగని
  4. ట నే
  5. నఁ దెలిసి