పుట:ఉత్తరహరివంశము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

9


వక్ష మదరంట వ్రేసిన వ్రాలె నతఁడు
మీఁదమీఁదనె ప్రాణంబు మిడు[1]కుచుండ.

46


వ.

ఇట్లు వ్రేసి.

47


గీ.

కరటికుంభస్థలం బొక్కఘాతఁ గొన్న
మురిసి హరి మూర్ఛదేఱకమున్న పాఱె
నది రయంబున దనుజుఁ డల్లంత నుఱికెఁ
జూప ఱగ్గింప విక్రమాటోపలీల.

48


వ.

ఇట్లు సంగరవిజయోత్సాహంబున సింహనాదంబుచేసి వరుణ సైన్యవార్ధి
బడబానలుండును దండధరసేనావనదవానలుండును హరసఖవీరభటహరిణ
శార్దూలుండును సురరాజశూరపరివారవారివాహపవనుండును నను కైవారంబులు
సెలంగ నరకాసురుండు.

49


క.

సమరమున గెలిచి పగతుర
సమస్తసంపదలు సేర సంతోషమునం
దమవారు మిగుల నుబ్బఁగ
నమరావతి సొచ్చె విభవ మరయుతలఁపునన్.

50


వ.

ఇట్లు సొచ్చి.

51


సీ.

నృత్తగీతంబులు నిస్సాణపటహసం
                 జాతంబులును లేనిచదుకములును
గాశ్మీరనికరంబుఁ గల్హారపుష్పోప
                 హారంబు లేనిసౌధాంగణములు
మణితోరణంబులు మహనీయశృంగార
                 [2]వారణంబులు లేనివాకిళులును
గర్పూరధూమంబుఁ గాంతాకటాక్షని
                 రీక్షలు లేనిగవాక్షములును


తే.

గదళికాదుకూలంబులుఁ గంపమాన
చమరవాలంబులును లేనిచంద్రశాల

  1. కమిడుక
  2. వారంబులును