పుట:ఉత్తరహరివంశము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

7


తే.

జోడు గానికైదువులఁ బోరాడి రచట
ముందఱ సురాసురుల బలంబులు గడంక
వాసవుఁడు [1]బలుఁడును బోరువడువు దోఁప
నట్లు గదిసి జయోల్లాస మతిశయిల్ల.

34


మ.

గద దట్టించి నిశుంభు మస్తకము నక్కాలుండు వ్రేయన్ మెయిన్
సదరం బైననొకింత కన్దిరిగియున్ శాతాసిచే వాఁడు జో
డు దెగన్ వేసిన మేను [2]వ్రస్సి యముఁ డాటోపంబుఁ జైతన్యముం
బ్రిదులన్ యామ్యబలంబు లావలనికిన్ భీతిం దొలంగించినన్.

35


క.

ఇట్టిక సూఁడినవాఁ[3]డో
యొట్టిడుకొన్నాఁ[4]డొ యనుచు నుల్లసమాడం
బట్టగుచు మగిడి చూడక
పట్టణమున కేఁగె లజ్జబండతనమునన్.

36


వ.

మఱియు నొక్కదిక్కున.

37


గీ.

శ్రీదుఁ డుద్ధతి మాణిభద్రాదులైన
యక్షులును గుహ్యకులును విద్యాధరులును
మొనసి తోతేరఁ దాఁకె నమ్మురునితోడఁ
జేరి నడవ డెబ్బదివేలు [5]పౌరవులును.

38


వ.

ఇట్లు (నడచి) శరపరంపర లాదనుజేంద్రుపయిం గురిసిన.

39


చ.

మురదనుజుండు [6]పౌరవసమూహమునుం గని రాజరాజుపై
శరనికరంబు వుచ్చి తనచక్కిన యెక్కిన యక్షగుహ్యకుల్
విరియఁగ ఖడ్గపాశముల వ్రేసిన వచ్చినత్రోవ వట్టి [7]కా
తరమున మాణిభద్రసహితంబుగ వచ్చినవారు పౌరులున్.

40


గీ.

కైదువులు విడిచి యెడళ్లు గగురుపొడు[8]
నంత నంత గకాపిక లైనవారిఁ
గని మురుండు కుబేరుని గదిసి యేసెఁ
బ్రతిభ [9]యాళీవిషోపమబాణతతుల.

41
  1. బలిపోరిన
  2. డస్సి
  3. డా
  4. డ వ
  5. శా
  6. శా
  7. రా
  8. నా