పుట:ఉత్తరహరివంశము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

ఉత్తరహరివంశము


గిరివిధంబున నచలుఁడై వరుణుమీఁద
శితశరపరంపరా[1]సారశతము లేసె.

28


క.

ఏసిన వరుణుడు దనుజు శ
రాసారములోన ముంచె నతఁ డాతని బా
ణాసనము క్షురప్రంబున
నేసెను లస్తకము విఱుఁగ నింద్రుఁడు సూడన్.

29


వ.

ఇట్లు ఖండింతలైన కోదండంబు సకాండంబుగా దిగవిడిచి.

30


చ.

వరుణుఁడు వైచెఁ బాశమున వైచిన నబ్బలితంపుఁ గైదువుం
గరమునఁ బట్టి దానవుఁడు క్రమ్మఱవైచెఁ దదస్త్ర మంబుధీ
శ్వరునకు నొవ్విసేయద నిజప్రభుఁ డంచు సురారి రేఁగి ని
ఘరగద [2]నూచి వైచిన గడున్ వడిమస్తముమీఁదఁ దాఁకినన్.

31


క.

నెత్తురు గ్రక్కుచు మూర్ఛా
యత్తుండై తెలిసి వరుణుఁ డనిమొన నిలువం
జిత్తంబులేక బీరపుఁ
[3]బొత్తము గట్టుకొనిపోయెఁ బోయినపోకై.

32


వ.

ఇట్లు వరుణుండు పాఱ వెండియు నొక్కదెస.

33


సీ.

తఱిమి నిశుంభుఁ డంతకుమీఁద నిరువదే
                 నమ్ము లేసిన నతం డతనిమీఁద
నేసె సాయకశతం బింద్రుఁడు చూడ న
                 ద్దనుజుఁ డారవిసూనుధనువు నఱకె
నతఁడు దండం బెత్తి యద్దైత్యు బొరిపుచ్చ
                 [4]నాదిగొనంగ బాణాసనంబు
వైచి వాఁ డసితోడ వైవస్వతునిమీఁద
                 నడచె నద్దేవదానవులు కడఁగి

  1. పరశ్శతము
  2. పూంచి
  3. బొత్తన మటు గట్టితొలఁగె
  4. నయిది