పుట:ఉత్తరహరివంశము.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

ఉత్తరహరివంశము


జిడిముడిపాటు పాదములఁ జెందఁగ మోముల దైన్య మొందగా,
జెడియును [1]జెడ్క కయ్యమునఁ జేరఁగఁ జిత్తము నిల్పి రయ్యెడన్.

143


వ.

కుంభాండుం డారూఢస్యందనుండై బలంబులతో నిట్లనియె.

144


ఉ.

బాణుఁడు వీఁడె మాంత్రయుతబాణుఁడు దానవశూరసైనిక
త్రాణుఁడు శంకరస్తుతిపరాయణుఁ డుజ్జ్వలరోపదీప్తదృ
క్కోణుఁడు సంగరస్ఫురితకోపపరాబ్ధఘటావళీజగ
త్రాణుఁడు యుద్ధవిశ్రుతపరాక్రమరౌద్రరసప్రమాణుఁడున్.


క.

గిరితనయాధిపషాణ్మా
తురముఖ్యబలంబు లివి యె[2]దుర్కొన్నవి కే
తురజోవిసరాంతర్హిత
హరిదశ్వసురాయనంబు లై క్రొవ్వలరన్.

146


వ.

 మీరింక సాధ్వసగ్రస్తులైన నగునె ధీరమనస్కు లై సమరంబునకు సమరం
డనునవసరంబున సర్వజ్ఞుం డఖర్వసమరగర్వపర్వతారోహణనిర్వక్రపర్వని
ర్వాహకనిర్వేదనపారిషదవీరపరివృతుండును నమందానందకందళితవందారుబృందా
రకబృందసందోహసందీయమానమానసుండును సమరజయజయారావమనోహ
రుండును రణశ్రమనివారణకారణశ్వేతాతపత్త్రాయమాణశర్వరీనాథశంకాసముత్పా
దిజటాజూటతటతటినీతామరససురఖిసరసవాత్యావిహాయస్సముత్థితపరాగవి
స్తారప్రభావిభాసితుండును నందీశసందావితస్యందనవందనమాలికాసందేహ
సర్వతఃప్రసర్యమాణత్రిశూలవిశాలమరీచిద్విగుణితతరణికిరణుండును వితత
భుజబలయుతసకలగణభటసముదయవిలసదసిరుచిరరుచివిరాజితమయూరరాజ
విచిత్రగతిచాతురీచతురసమ్మదసేనానీసైన్యసేవ్యమానుండును నై జనార్దనుం
దాఁకి నిలునిలుమని యదల్చి మఱియును.

147

శివకేశవులయుద్ధము

శా.

చతురంభోనిధిమేఖలావలయభూచక్రంబు గంపింపఁగా
శితికంఠుండు విశేషరోషవిరిసత్సింహారవోద్యుక్తుఁడై

  1. జెడకయ్యమును జేయఁగ
  2. దూరోన్నతకే