పుట:ఉత్తరహరివంశము.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

241


శతనారాచము లేసినన్ హరియుఁ బర్జన్యాస్త్ర మేసె న్వెసన్
శతరూపం బయి తచ్చరంబు శివునిన్ సైన్యంబులం గప్పఁగన్.

148


గీ.

అట్లు పొదివినఁ గుపితుఁడై యంధకారి
యగ్నిదైవత్యశరమున నసురవైరి
నేసె నేసిన నాయస్త్ర మెల్లకడల
మంట మొత్తంబుతో దివి మాఱు మలసె.

149


శా.

ఆయస్త్రం బతిఘోరమై పొదువ దైత్యారాతియున్ రాముఁడున్
మాయావల్లభుఁడుం బతత్రివిభుఁడు న్నాకీక్షణాగమ్యులై
ఛాయాహీనత నొంది రగ్నివిశిఖాజాజ్వల్యమానాంగులై
పోయెం బో యదువంశ మంచుఁ [1]గలఁగన్ భూతావలుల్ భీతితోన్.

150


గీ.

అ ట్లవస్థాంతరప్రాప్తు లైనవారిఁ
జేరి దనుజులు చేసిరి సింహనాద
మగ్నిబాణశిఖావృతుం డైనవానిఁ
బోలిసె నని యెంచి మాధవుఁ బొదివి హరుఁడు.

151


ఉ.

అంతట నంబుజోదరుఁడు నబ్ధిపదైవతశస్త్ర మేసినన్
సంతతివారిధారలను జారుతటిల్లతికావితాన మ
త్యంతమహానినాదసతతాద్భుతభీషణగర్జితంబులన్
సంతస మందఁ జేసె సురసంఘములన్ దనుజుల్ చలింపఁగన్.

152


క.

ఆశస్త్రదహనుఁ డాఱిన
నీశానుఁడు రోషవహ్ని నేసెఁ గ్రమమునం
బైశాచము రాక్షసమును
నైశం బాంగిరస మనుమహాస్త్రముల హరిన్..

153


వ.

వాసుదేవుండునుం దదస్త్రనివారణంబు చేయఁ దలంచి.

154


సీ.

వాయవ్య సావిత్ర వాసన మోహన
                 ముఖ్యాస్త్రముల నేసి మురవిరోధి

  1. జెలఁగెన్ భూతావళుల్ భీతితోన్