పుట:ఉత్తరహరివంశము.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

239


స్యందనకుంజరహయభటవ్రజములు
                 తునక లై ధరమీఁదఁ దొరుగుచుండు


ఆ.

మొదల మీరు గెల్చుకదనంబులం దెల్ల
నిత్తెఱంగులావు రిత్తవుచ్చి
తిరుగఁ దగునె మీకు ధీరతఁ బెడఁబాసి
వినుతశౌర్యులార! [1]దనుజులార!

139


సీ.

సంగరం బనిన నుత్సవము కేఁగిన క్రియ
                 సొలవక చనియెడిశూరులార!
శంకరుఁ డెప్పుడు సంభావనలు చేయ
                 నుల్లసిల్లుచు నుండు యోధులార!
గాత్రఖండములు ధరిత్రిపైఁ దొరుగంగ
                 శత్రుల గెలిచెడి జైత్రులార!
[2]సమితిలో సేనానిశౌర్యంబు మెచ్చక
                 మిన్నక తిరిగెడి మేటులార


ఆ.

ప్రకటులార మాన్యబలులార విశ్రుత
విక్రమప్రభావవితతులార!
ప్రమథులార! దైత్యపతులార మీకును!
బాఱు టర్హమయ్య బవరమందు.

140


వ.

అట్లుంగాక.

141


క.

ఏ నుండఁగ నీలోపల
మానవుల జయించు టెంత మానము మీకున్
మానుఁడు పలాయనక్రియ
దానవవరులార యననఁ దదనీకంబున్.

142


చ.

విడువక పాఱి పారిషదవీరులుఁ గొందఱు యాతుధానులుం
దడఁబడుచిత్తముల్ రయము దక్కినబీరము వియ్యమందఁగాఁ

  1. వీరులార
  2. శివగణసమితి....మెచ్చక తిరిగెడి