పుట:ఉత్తరహరివంశము.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

ఉత్తరహరివంశము


హతశేషానీక మాజిన్ వ్యథఁ బడముసలాద్యాయుధంబుల్ ధరన్ వై
చి తొలంగం బాఱఁ బోరం జిడిముడి నడుచుం జిక్కుచుం బాఱుచుండన్.

135


వ.

బాణుండు వారలతో నిట్లనియె.

136


ఉ.

మానితమాన[1]ధైర్యకులమందిరసుందరకీర్తివిస్ఫుర
ద్దానవవంశజాతు[2]లరు దారుణశాతమహాస్త్రసంహతిన్
స్థానముఁ గీర్తియుం గిరిశసంగతియుం బెడఁబాసి పోదురే
మానముకంటెఁ బ్రాణములు మంచివియే తలఁపంగ నక్కటా!

137


సీ.

అనిమొనఁ బావకు నైన నాహుతి చేయఁ
                 దివిరెడుమదిలోనిధీరగుణము
తమలావుకొలఁదులు దా రెఱుంగర యంచు
                 జను లెల్ల మిముఁ జేయుసంస్తవంబు
మిన్ను పయిఁ బడినను మెలుపుతో నఱచేతు
                 లొగ్గఁ జాలుటకు నై యోర్చులావు
మానిసిగందంబు మాఱు వల్చె నటంచు
                 నాజిలో వైరులఁ నడచులావు


ఆ.

పాఱు విడిచి మీకు బాఱంగ నగునయ్య
వితితశౌర్యులార! వీరులార
సతతనిశితశస్త్రసందోహధరులార!
దళితవిమతులార! దనుజులార!

138


సీ.

వేలుపుజడదారి విం దారగించుచో
                 నానందబాష్పంబు లడ్డపడును
రక్తనిమ్నగ ననురాగంబు సంధిల్ల
                 నుబ్బి భూతావళు లోలలాడు
నిర్జరకామినీనిలయాంగణంబులఁ
                 బచ్చతోరణములు పరఁగుచుండు

  1. దైత్య
  2. లయి