పుట:ఉత్తరహరివంశము.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

211


త్యాసక్తసౌహృదులు [1]
త్యాసీనులు సురలు వార లపకారకులే.

299


క.

ఇప్పుడు నీ పలికిన పలు
కొప్పదు ప్రద్యుమ్నతనయు నొక్కతె వలపుం
ద్రిప్పులఁ బిడి కొనిపోయెను
దప్పెం బుంశ్చలికి నేటితగవుం గిగవున్.

300


వ.

అని చింతించుచున్న మురాంతకునకు నక్రూరుం డిట్లనియె.

301


క.

మనపని దనపని దనపని
మనపని గా నడతు మతఁడు మనము నొకఁడు మో
చినమో పిందఱు మోచిన
యనువున నీతోడువడుట యతనికిఁ గీడే.

302


ఆ.

ఎట్టికుబుద్ధి యైనఁ దనయిష్టసహాయుని కెగ్గు చేయునే
పట్టెడుచోటు గాల్చుకొను బాలిశుఁడుం గలఁడే సురేశ్వరుం
డట్టె యతండు నిన్ను దనుజాంతకుఁ డండ్రు విరోధ మేటికిన్
బుట్టెడు నిద్దఱుం ద్రిదివభూతలరక్షణ మాచరింపఁగన్.

303


క.

దేవతలఁ గావ మానుష
భావంబున నవతరించి పని వూనిన యా
దేవాదిదేవుఁడవు నీ
వేవిధమున వారు నీకు నిటు చేయుదురే.

304


వ.

అనుటయు నచ్యుతుండు.

305


శా.

గంధర్వామరయక్షరాక్షసుల కీ కార్యంబు సిద్ధించునే
[2]బంధక్యాహృతుఁడైనవాఁడు దలఁపం బ్రాద్యుమ్ని దైత్యాధిప
స్కంధావారవిహారిణుల్ గులట లీ చందంబు గావింతు రీ
[3]బంధుభ్రాంతి వెలార్చెదన్ మనుమనిం బ్రాగ్వృత్తికిం జేర్చెదన్.

308
  1. స, త్యాసికు లగు
  2. బంధవ్యాహృతుఁ
  3. బంధ