పుట:ఉత్తరహరివంశము.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

ఉత్తరహరివంశము


క.

[1]దెస చెడి మైందద్వివిదులు
నసిలోమపులోములును హయగ్రీవుండున్
[2]వసి మాలి సౌంభసాల్వులు
నిసుంభ నరకులును జెడిరి నీ ఖడ్గమునన్.

292


గీ.

మఱియుఁ గొందఱు నీచేత మడిసి రందు
మిడి యడఁగఁ జొచ్చి తమసూడు దడవలేరు
పారిజాతంబు దెచ్చుచో బ్రదికి పోయె
నిర్జరాధీశుఁ డొకరుఁడు నిన్నుఁ దాకి.

293


శా.

నాకుం జూడ మనంబునం గుటిలుఁడై నాకేశుఁ డిబ్బాలుఁ దా
నే కొంపోయినవాఁడు వాఁడు దగువాఁడే గౌతమస్త్రీరహ
స్స్వీకారాదులు తచ్చరిత్రములు నాచేఁ గ్రొత్తగా నేల క
ర్ణాకర్ణికగథలందు మున్ను వినవే నానాప్రకారంబులన్.

294


వ.

అనుటయు దనుజవైరి విచారించి నిట్టూర్పు నిగిడించి.

295


క.

నాతండ్రీ సురపతిపై
నే తప్పును లేదు మన మనేకవిధములన్
దైతేయవధము చేయుట
యాతని కార్యంబ మనల నతఁడు విడుచునే.

296


వ.

అట్లుం గాక.

297


గీ.

ఉత్తముండు హితము చేసి యూరకుండు
మధ్యముండు హితము చేసి మాఱు వెదకు
నధముఁ డొరుచేయుహిత మైన నణఁచి పుచ్చు
హితమునకు నెగ్గు చేయువాఁ డెవ్వఁ డగును.

298


క.

చేసినమే లెఱుఁగుదు రొరు
గాసింపరు కుచ్చితంపుఁ గఱద లెఱుఁగ ర

  1. శస
  2. నసి మాలి