పుట:ఉత్తరహరివంశము.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

207


తే.

నఁడు గడానిబంగారురత్నంపుబొమ్మ
ముంగిటినిధాన మమ్మలముద్దు దమ్ము
లన్న యీతనిఁ గనదేని కన్నతల్లి
కడుపు మసిగాదె దయ్యమ! కరుణ లేదె.

276


సీ.

అఖిలలోకాధీశుఁ డగుచక్రధరునింట
                 నొకకీడుమాట నేఁ డొదవె నమ్మ
బాల్యంబునంద శంబరుఁ జంపెఁ బ్రద్యుమ్నుఁ
                 డతనిలా వెల్లిద మయ్యె నమ్మ
[1]కీడు లేదన దేవకీదేవిబలగ మొ
                 ప్పినఁ బాలలౌఁ బండ్లు పిసికి రమ్మ
యదువీరులు ప్రమత్తు లని మున్ను మెచ్చని
                 చుట్టాలు నగ సేసి చూపె నమ్మ


తే.

చెడఁ దలంచిరి గా కేమి సిలుగు చింత
లీని యివ్వీటి కౌరు లింత పూని రేని
గడచె నింక మారతీదేవి కడుపుచల్ల
నగుట [2]విధి యిన్ని గలిగించె నక్కటకట.

278


క.

మధుమథనక్రోధానల
మధికముగా మండ నూఁదు నవ్వెంగలికిన్
విధి యలుగక [3]మును మృత్యు
క్షుధార్తివివృతాస్యపదవికోఱ యలుగదే.

279


సీ.

అనిరుద్ధసింహంబు నంటి చావునకుఁ ద
                 ప్పిన కరి హరితోడఁ బెసఁగ కున్నె
యదుపుంగవున కింత యపకార మొనరించి
                 దేవతావిభుఁ డైన దిగులు చొరఁడె

  1. గెడలే దనఁగ
  2. విధి గన్నికలు చేసి నక్కటకట
  3. మృత్యువునకు