పుట:ఉత్తరహరివంశము.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

ఉత్తరహరివంశము


మనములోపల నెగ్గించి మరలిపోయె
నాత్మమందిరమునకుఁ గుంభాఁడుఁ గూడి.

272


క.

అంత నిట హరినగరిలో
నంతఃపురకాంత లెల్ల ననిరుద్ధుని సౌ
ధాంతరములందుఁ దడవుచుఁ
జింతించుచు నింక నేమి చేయుద మనుచున్.

279


సీ.

చెందమ్మివిరులలోఁ జిందుతేనెలు వోలె
                 గన్నుల బాష్పాంబుకణము లడర
[1]వదరుచీకట్లలో వ్రాలుచుక్కలవోలె
                 వేణీభరమ్ములో విరులు వ్రేల
దూలుతీఁగెలవెంటఁ దూగుతేఁటులు వోలె
                 నసదునెన్నడుముల నారు లొలయ
[2]రాపుజక్కవలఁ జేరనిచంద్రికలు వోలె
                 జన్నుల ముత్యాలసరులు పెనఁగ


తే.

ముద్దుమోము లల్లార్చుచో మూఁపులందు
గర్ణభూషణజాలంబు గళిగళింప
మార్చి మార్చి చేతుల వ్రేళ్ళ మడఁచికొనుచు
నింక నెట్లమ్మ యంచు నయ్యింతు లేడ్వ.

274


వ.

అందుఁ గొందఱు.

275


సీ.

చక్కనివారిలోఁ జక్కనివాఁడు దాఁ
                 [3]గడుఁబిన్నగాని వేగంబు వీఁడు
బంటు నొచ్చిననోరఁ బలుకండు నెఱవాది
                 సుఖభోగి చుట్టాలసురభి రాచ
బిడ్డయై యుండి గబ్బిదనం బెఱుంగఁడు
                 గరగరనై యుండుఁ గలయ నేర్చు
నూఁపరలాఁడు గాఁ డుపకారి నవ్వు మే
                 లము గాని తనవారు లాఁతివా ర

  1. వలుదచీకట్లలో
  2. రేయిజక్కవలఁ బేరిన
  3. గడుఁబిన్న తాన వేగంబవీఁడె